• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఏపీ వాసులకి శుభవార్త...

ఏపీ వాసులకి శుభవార్త ..లాక్ డౌన్ నుండి వాటికీ కూడా మినహాయింపు !

By - Tupaki Desk
Update: 2020-05-30 08:10 GMT

దేశ వ్యాప్తంగా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి విధించిన లాక్ డౌన్ 4.0 మే 31 కి ముగియనుంది. ఇక ఇప్పటికే లాక్ డౌన్ కొనసాగించే అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చలు జరుపుతున్నారు. అయితే, లాక్ డౌన్ ౪ లో ప్రభుత్వాలు భారీగా సడలింపులు ఇచ్చాయి. ఇప్పటికే  లాక్ ‌డౌన్ నుండి భారీగా‌ సడలింపులు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం.. తాజాగా మరిన్ని సడలింపులను ప్రకటించింది.

ముఖ్యంగా రవాణా రంగానికి మినహాయింపులను ప్రకటించింది ఏపీ ప్రభుత్వం .రాష్ట్రంలో వైరస్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని కంటైన్మెంట్ జోన్ల మినహా ,రాష్ట్ర పరిధిలోని ప్రజారవాణా వాహనాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటికే ఆర్టీసీ బస్సులు నడిచేందుకు పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ప్రైవేట్ వాహనాలకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో ఆటోలు, కార్లు, ఇతర ప్రైవేటు వాహనాలకు లాక్ ‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించింది.

అయితే 50 శాతం సీట్లతో ప్రయాణానికి మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. ఆటోలు 1+2, కార్లు 1+3, మినీ వ్యాన్లు 50 శాతం ప్రయాణికులను చేరవేసేందుకు అనుమతిచ్చారు. అలాగే ప్రభుత్వ చూచనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. ఇక రాష్ట్రంలో 25 శాతం ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయని, బస్సులలో 45 శాతం మాత్రమే ఆక్యుపెన్సీ రేషియో వస్తుందని ఏపీ సర్కార్ పేర్కొంది. మొత్తానికి మరికొన్ని లాక్ డౌన్ మినహాయింపులతో ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం. ఇక అదే సమయంలో కరోనా కట్టడి కోసం కూడా తీవ్రంగా కృషి చేస్తోంది. అంతే కాదు జూన్ 1 తర్వాత కేంద్రం మార్గదర్శకాలను బట్టి మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపింది. అలాగే, జూన్ 1 తర్వాత 28 రైళ్లు రాష్ట్రం మీదుగా వస్తున్నాయని తెలిపారు.

ఇకపోతే, గడిచిన 24 గంటల్లో 11,638 శాంపిల్స్ ‌ను పరీక్షించగా 33 పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి అని, అలాగే మరణించిన వారి సంఖ్య 60కి చేరింది. మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 2874 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 2037 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. 777 మంది చికిత్స పొందుతున్నారు అని ప్రకటించింది.
Tags:    
  • Andhra Pradesh Lockdown 
  • Autos 
  • Taxis 
  • Dangerous Disease In Andhra Pradesh 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Telugu News Updates 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

ఇతరుల ఆనందమే కొలమానమా? జెన్ జెడ్ ను ఒత్తిడికి గురిచేస్తున్న సోషల్ మీడియా

2026-11-02 11:30 GMT

50 టీఎంసీల వరద..?! ‘మురసు’తో నిండనున్న పులిచింతల, నాగార్జునసాగర్

2026-11-02 11:04 GMT

దక్షిణాదికి బుల్లెట్ ట్రైన్.. బెంగళూరు నుంచి చెన్నైకి కేవలం 73 నిమిషాల్లోనే!

2026-11-02 10:24 GMT

తుఫాన్ల నెల నవంబర్.. అసలు కారణాలు ఏంటి?

2026-11-02 10:00 GMT

అమెరికా ఎన్నికలతో భారత్‌కు కొత్త పరీక్ష.. ట్రంప్ ఓడితే భారత్ కు లాభమా? నష్టమా?

2026-11-02 10:00 GMT

రాప్తాడు ఉన్మాదికి పోలీసు శిక్ష.. కుళ్లిపోయిన కుడికాలు, తొలగించే అవకాశం!

2026-11-02 09:58 GMT

తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్.. అమిత్ షా ‘హైదరాబాద్ వ్యూహం’ గేమ్ ఛేంజర్ అవుతుందా?

2026-11-02 09:50 GMT

నెల్లూరుకు సమీపంలో ‘మురసు’.. ఐదు జిల్లాలలో భారీ వర్షాలు

2026-11-02 08:24 GMT

రాప్తాడు బాలిక హెల్త్ బులిటెన్.. కీలక సమాచారం వెల్లడించిన మంత్రి లోకేశ్

2026-11-02 07:56 GMT

ఓడిపోతానని ట్రంప్ కు జ్ఞానోదయం.. ఇన్నాళ్లకు తెలిసి (తెలివి) వచ్చింది..

2026-11-02 07:05 GMT

మారథాన్‌లో విజయం.. జీవితంలో విషాదం.. పరుగుపందెం పూర్తి చేసి ప్రాణాలు విడిచిన టెక్కీ

2026-11-02 06:43 GMT

తొలిరోజే రూ.68 లక్షల జరిమానాలు.. ఢిల్లీలో కాలుష్యంపై యుద్ధం..

2026-11-02 05:28 GMT

Copyright @2026

Powered by Blink CMS