ఇన్ ఫ్రా తిరోగమనం.. దేనికి సంకేతం..?

Update: 2019-08-16 07:37 GMT
ఇన్ ఫ్రా రంగంలో నష్టాలు మొదలయ్యాయా.? ఎన్నికల తర్వాత  ప్రభుత్వాలు మారడం.. కొత్త ప్రభుత్వాలు రావడంతో పునసమీక్షలు మొదలై.. మళ్లీ టెండర్లు పిలుస్తూ పాత సంస్థలకు స్వస్తి పలకడం చేయడంతో మౌలిక సదుపాయాల సంస్థలకు గడ్డు కాలం ఎదురైనట్టు కనిపిస్తోంది.

దేశంలోనే  మౌళిక సదుపాయాల రంగంలో అపార అనుభవం ఉన్న ‘జీఎంఆర్’ ఇన్ ఫ్ట్రాస్ట్రక్చర్ సంస్థకు తాజాగా ఈ ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల త్రైమాసికంలో నష్టాలు రావడం గమనార్హం.  జూన్ తో ముగిసిన త్రైమాసికంలో జీఎంఆర్ ఇన్ ఫ్రాకు ఏకంగా రూ.334.85 కోట్ల నికర నష్టం వచ్చింది. ఇదే గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో సంస్థ రూ.238 కోట్ల నష్టాలు చవిచూసింది. దీనిబట్టి తాజాగా నష్టాలు పెరిగినట్లు కనిపిస్తోంది.

అయితే జీఎంఆర్  స్తూల ఆదాయం మాత్రం స్వల్పంగా పెరగడం విశేషం. జీఎంఆర్ మొత్తం కంపెనీ ఆదాయం 1992 కోట్లకు పెరిగింది. గత సంవత్సరం ఇదే సమయంలో స్థూల ఆదాయం 1738 కోట్లు మాత్రమే ఉంది. అంటే 254 కోట్ల నికర లాభాన్ని జీఎంఆర్ కంపెనీ ఆర్జించింది. ఇన్ ఫ్రా మాత్రం 335 కోట్ల నష్టంలో ఉండడం గమనార్హం.

దీన్ని బట్టి దేశంలో మౌళిక వసతుల రంగంలో తిరోగమనం మొదలైందా అన్న అంచనాలు మార్కెట్ వర్గాల్లో నెలకొన్నాయి.  ఇన్ ఫ్రాలో నష్టాలు బాట మొదలైతే అది మార్కెట్ ను కృంగదీసి ఉపాధిని దెబ్బతీస్తుందా అన్న ఆందోళన మార్కెట్ వర్గాల్లో నెలకొంది.
    

Tags:    

Similar News