గాంధీ ఆసుపత్రిలోఘోరం : అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్ .. వెలుగులోకి కీలక విషయాలు !
హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి .. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా చుట్టు పక్కల ఉన్న రాష్ట్రాలకి కూడా పెద్దాసుపత్రిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. హైదరాబాద్ నగరం నడిబొడ్డున , విశాలమైన ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ప్రతి నిత్యం వందల మంది రోగులు వచ్చి వెళ్తూ ఉండే ప్రదేశం. కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో గాంధీ ఆస్పత్రి అందించిన సేవలు ఎనలేనివి. అలాంటి గాంధీ ఆసుపత్రిలో ఒక అమానుష ఘటన జరిగింది. రోడ్లు, మందిరాలు, థియేటర్లలోనే కాదు ఆఖరికి ఆసుపత్రుల్లో కూడా మహిళల పై కామంధులు రెచ్చిపోతున్నారు. మూత్రపిండాలు పాడైన బావను తీసుకొని, అక్కకు తోడుగా ఆసుపత్రికి వచ్చిన అక్కా-చెల్లెల్లపై ఐదుగురు దుర్మార్గులు సాముహిక అత్యాచారం జరగటం అది ఆలస్యంగా వెలుగులోకి రావటం నగరంలో కలకలం రేపుతుంది.
నిత్యం వందలాది మంది రోగులు వచ్చిపోయే గాంధీ ఆస్పత్రిలో.. తమపై గ్యాంగ్‌రేప్ జరిగిందని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.అనారోగ్యంతో బాధపడుతున్న బావకు సహాయంగా అక్కతో పాటు తానుగాంధీ ఆస్పత్రికి వచ్చామని.. మత్తు మందిచ్చి, ఆస్పత్రి సెల్లార్‌లో లైంగికదాడి చేశారని బాధిత మహిళ ఆరోపించింది. ఈ ఘటన గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే ...
మహబూబ్ నగర్ జిల్లాకి చెందిన నర్సింహులు అనే వ్యక్తి ఈ నెల 4వ తేదీన గాంధీ ఆస్పత్రికి వచ్చాడు. వచ్చేప్పుడు భార్య, ఆమె చెల్లి కూడా వెంట వచ్చారు. గాంధీ ఆస్పత్రిలో ఔట్ సోర్సింగ్ ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న ఉమామహేశ్వర్ అనే వ్యక్తిది కూడా నర్సింహులు వాళ్ల ఊరే. అయితే, అతను ఉన్నాడన్న భరోసాతో నర్సింహులు కుటుంబంతో ట్రీట్ మెంట్ కోసం వచ్చాడు. ఈ నెల 11వ తేదీన అతనికి కిడ్నీ సంబంధిత ట్రీట్ మెంట్ జరిగింది. కానీ, తీరా అతను డిశ్చార్జ్ అయ్యే సమయానికి తన భార్య, చెల్లెలు కనిపించకుండా పోయారు. వాళ్ల కోసం వెతుక్కుంటూనే ఉన్నాడు నర్సింహులు. గాంధీ ఆస్పత్రిలో రేడియాలజీ విభాగంలో డార్క్‌రూమ్ అసిస్టెంట్‌గా పనిచేసే ఉమామహేశ్వర్ అనే వ్యక్తి వారికి బంధువు. అతడి సహకారంతోనే ఆమె తన భర్తను గాంధీ ఆస్పత్రిలో చేర్చింది. ఏడో తేదీ నుంచి ఆమె, ఆమె చెల్లెలు ఇద్దరూ పేషెంట్ వద్దకు వెళ్లట్లేదు.
ఈ నెల 9వ తేదీన పేషెంట్ కుమారుడు, తండ్రి వద్దకు వచ్చాడు. తల్లి, పిన్ని 7వ తేదీ నుంచి తండ్రి వద్దకు రావట్లేదని తెలియడంతో వారి కోసం వెతికినా ఆచూకీ లేకపోవడంతో 11వ తేదీన తండ్రిని ఇంటికి తీసుకెళ్లాడు. ఆదివారంనాడు బాధిత మహిళ కుమారుడికి ఫోన్ చేసిన ఉమామహేశ్వర్, ఆస్పత్రి వెనుక భాగంలో ఖాళీ ప్రదేశంలో మీపిన్ని ఉంది అని చెప్పడంతో వెంటనే అక్కడికి చేరుకున్నాడు. అపస్మారక స్థితిలో ఉన్న పిన్నికి సపర్యలు చేసి ప్రశ్నించగా, తనపై జరిగిన అఘాయిత్యం గురించి తెలిపిందన్నాడు. తల్లి ఆచూకీ గురించి అడిగినా చెప్పలేకపోయిందని, ఆమె తేరుకుంటే అన్ని వివరాలూ తెలుస్తాయనే ఉద్దేశంతో తమ ఊరికి తీసుకెళ్లానని తెలిపాడు.
ఇదిలావుంటే, హైదరాబాద్ లో మిస్సయిన నర్సింహులు మరదలు మహబూబ్‌నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర తేలింది. ఏం జరిగింది అని ప్రశ్నిస్తే తనను, తన అక్కను కిడ్నాప్ చేశారని, కొందరు లైంగికంగా వేధించారని, అత్యారానికి పాల్పడ్డారని చెప్పింది. ఏదోలా వాళ్ల నుంచి తప్పించుకుని బయటపడ్డానని ఏడుస్తూ చెప్పింది. అయితే , హాస్పిటల్ లో మిస్సయిన ఆమె అక్క జాడ మాత్రం ఇంకా తెలియలేదు. బాధితురాలి ఫిర్యాదుతో మహబూబ్‌నగర్‌లో జీరో ఎఫ్ఐఆర్ రికార్డ్ చేసి, కేసును హైదరాబాద్‌లోని చిలకలగూడ స్టేషన్‌కు మార్చారు
అయితే, నర్సింహులు భార్యకు, ఆమె చెల్లెల్లికి కల్లు తాగే అలవాటు ఉంది. ఉమామహేశ్వర్ ఈ నెల 8న ఆ మహిళలను ఒక గదికి తీసుకెళ్లి కల్లులో మత్తుమందు కలిపి తాగించాడని తెలుస్తోంది. వారు అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత.. ఉమామహేశ్వర్‌తో పాటు మరికొందరు వారిపై సామూహికంగా అత్యాచారం చేశారు. ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించారు. మర్నాడు వారిద్దరినీ సెల్లార్‌లోని చీకటి గదిలోకి తీసుకెళ్లి మరోమారు అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం నగరంలోని పలు ప్రాంతాలకు తీసుకెళ్లారు. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న అనంతరం పోలీసులు ఉమామహేశ్వర్ ను అదుపులోకి తీసుకున్నారు. అతనితోపాటు ఇంకా ఎవరన్నదానికోసం ఎంక్వైరీ జరుగుతోంది. మరోవైపు, ఇంకా జాడలేని నర్సింహులు భార్య కోసం కూడా పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ముందుగా భాదితురాలి ఫిర్యాదు తీసుకొని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.