ఇంత వేరియేషనా? ఇరాన్ అలా.. అమెరికా ఇలా!
తమ డిమాండ్లు నెరవేరనప్పుడు మాత్రమే యుద్ధం ముగుస్తుందని చెప్పేసిన తీరు చూస్తే..యుద్ధం ముగింపు.. కొనసాగింపు కచ్ఛితంగా ఇరాన్ చేతుల్లోనే ఉందన్న వాదన మరోసారి స్పష్టమైందని చెప్పాలి.;
అసలేం జరుగుతోందన్నది ఇప్పుడో పెద్ద ప్రశ్నగా మారింది. దీనికి కారణం ఇరాన్.. అమెరికా నుంచి వెలువుడిన భిన్నమైన వ్యాఖ్యలే. ఓవైపు యుద్ధం ముగిసినట్లేనని అమెరికా చెబుతుంటే.. మీరు డిసైడ్ అయితే యుద్ధం ఆగిపోతుందా? అది చెప్పాల్సింది మేం కదా? అన్నట్లు ఇరాన్ తీరు ఉంది. ఇదిలా ఉంటే.. అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతూ ఇరాన్ నుంచి అద్భుతమైన బహుమతి లభించినట్లుగా చెబుతూ ఊరిస్తున్నారు. దీనికి ఏ మాత్రం సంబంధం లేని రీతిలో ఇరాన్ నుంచి వెలువడిన ప్రకటన ప్రకారం.. తాము కోరుకున్న డిమాండ్లు నెరవేరినప్పుడు మాత్రమే తాము యుద్ధాన్ని అపాలని డిసైడ్ అవుతామని స్పష్టం చేస్తోంది.
ఇలా సంబంధం లేని వ్యాఖ్యలు రెండు వైపుల నుంచి వెలువడటంతో అసలేం జరుగుతుందో అర్థం కాని కన్ఫ్యూజన్ ఇప్పుడు నెలకొంది. ఇదంతా చూస్తే.. ఒకరికొకరు సంబంధం లేని వాదనలు వినిపించటం.. ఇరువురి మధ్య అసలేం జరుగుతుందో అర్థం కావట్లేదు. అసలు యుద్ధం జరుగుతుందా? లేదా? అన్న దానిపై కూడా క్లారిటీ రాని పరిస్థితి. తొలుత ఇరాన్ చేసిన ప్రకటనను చూస్తే.. అందుకు కాల్పుల విరమణకు పెద్ద‘నో’ను ఇప్పటికే చెప్పేసింది.
తమ డిమాండ్లు నెరవేరనప్పుడు మాత్రమే యుద్ధం ముగుస్తుందని చెప్పేసిన తీరు చూస్తే..యుద్ధం ముగింపు.. కొనసాగింపు కచ్ఛితంగా ఇరాన్ చేతుల్లోనే ఉందన్న వాదన మరోసారి స్పష్టమైందని చెప్పాలి. అమెరికా - ఇరాన్ మధ్య పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తుందన్న వాదనల వేళ ఇరాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి ఆసక్తికరంగా మారాయి. మొత్తంగా పాకిస్థాన్ ముందుకు వచ్చినా.. ఇరాన్ మాత్రం యుద్ధంపై తాను అనుకున్నదేదో జరిగేది ఏదో జరగాలన్న పట్టుదలతో ఉన్నట్లుగా కనిపిస్తుంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇదే అంశంపై స్పందించారు. ఆయన వాదన ఇప్పటివరకు ఇరాన్ విషయంలో వ్యవహరించిన తీరుకు భిన్నంగా.. ప్రపంచం సైతం విస్మయానికి గురి చేసేలా ఉండటం గమనార్హం. ఇరాన్ పేరును ప్రస్తావించకుండా ‘‘నిన్న వారి నుంచి అద్భుతమైన, చాలా పెద్ద బహుమతి లభించింది. అణ్వాయుధాన్ని ఎప్పటికీ తయారు చేయకుండా ఉండేందుకు ఇరాన్ అంగీకరించింది. మాకు లభించిన బహుమతి చాలా పెద్దది. ఇది అణుసంబంధమైనది కాదు. చమురు, గ్యాస్ తో ముడిపడినది’ అని పేర్కొన్నారు.
తమకు లభించిన పెద్ద బహుమతి గురించి చెప్పిన ట్రంప్.. అదే సమయంలో తమకు లభించిన బహుమతి వివరాల్ని మాత్రం చెప్పకుండా రహస్యంగా ఉంచేశారు ట్రంప్. ఇదంతా చూస్తే.. ఇంధన రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి గురించి అయి ఉంటుందన్న ఆసక్తి వ్యక్తమవుతోంది. అంతేకాదు ఇరాన్ తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవటానికి తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తీరు చూస్తే.. అమెరికా ప్రయోజనాలకు భారీ ప్రయోజనాన్ని కల్పించేలా ట్రంప్ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పాలి. మరి.. ఈ తీరునకు తాజాగా ఇరాన్ కౌంటర్ ఇచ్చేటం చూస్తే.. అసలేం జరుగుతుంది? అన్నదిప్పుడు అతి పెద్ద ఇష్యూగా చెప్పాలి. దీనికి సంబంధించిన వివరాలు వీలైనంత త్వరగా వస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరేం జరుగుతుందో చూడాలి.