కరోనాకు భారతీయులు భయపడనక్కర్లేదట.. ఆ ట్యాబ్లెట్ ఒక్కటి

Update: 2020-03-06 05:55 GMT
కరోనా పేరు చెప్పినంతనే బెదిరిపోతున్న పరిస్థితి. ప్రపంచానికి చుక్కలు చూపిస్తున్న ఈ మహమ్మారి భారతీయులపై ప్రభావం చూపించే సత్తా తక్కువేనట. ఈ విషయాన్ని సాదాసీదా వ్యక్తి చెప్పటం లేదు. వైరస్ ల మీద ప్రత్యేక పరిశోధన చేసి.. అనేక అంతర్జాతీయ అవార్డుల్ని అందుకున్న భారతీయ శాస్త్రవేత్త గగన్ దీప్ కాంగ్ చెబుతున్నారు.

కొవిడ్ 19 సాంకేతిక నామంతో వ్యవహరించే కరోనా వైరస్ భారతీయుల్ని ఏమీ చేయలేదని.. దాని ప్రభావం ఎంత తక్కువన్న విషయాన్ని అందరికి అర్థమయ్యే ఒక్క ఉదాహరణతో ఆమె చెప్పేశారు. ఈ వైరస్ సోకిన ప్రతి ఐదుగురిలో నలుగురికి ప్రత్యేక వైద్యమే అవసరమే లేదని తేల్చారు. ప్రత్యేక వైద్యం అవసరం లేకుండానే ఈ వైరస్ తగ్గిపోతుందని.. మరీ అవసరమైతే పారాసిటమాల్ ట్యాబ్లెట్ సరిపోతుందన్నారు.

ఇతర సాధారణ.. జలుబు.. జ్వరానికి వాడినట్లే దీన్ని వాడాలని చెబుతున్నారు. అయితే.. కరోనా విషయంలో బెంగ అంటూ ఏదైనా ఉందంటే.. అది ఒక్క పెద్ద వయస్కులకేనని చెబుతున్నారు. కోవిడ్ 19 వల్ల చిన్నారుల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవని.. ఈ వైరస్ సోకి.. జ్వరంతో శ్వాస తీసుకోవటానికి ఇబ్బంది పడే పెద్ద వయస్కులతోనే ఇబ్బందని చెబుతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీ క్రిస్టియన్ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ గా పని చేస్తున్న ఆమె.. గతంలో తాను చేసిన ఎన్నో పరిశోధనల తో పలు అవార్డుల్ని సొంతం చేసుకున్నారు. ప్రఖ్యాత రాయల్ సొసైటీ ఫెలో షిప్ పొందిన ఆమె.. నార్వేకు చెందిన సంస్థ చేపట్టిన అంటువ్యాధుల సన్నద్ధత ప్రోగ్రాంకు ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న గగన్దీప్ కాంగ్ చెప్పిన మాటలు.. కరోనాకు కంగారు పడిపోతున్న కొందరు భారతీయులకు భారీ రిలీఫ్ గా చెప్పక తప్పదు.
Tags:    

Similar News