కాబోయే సీఎంకు ముందస్తు అభినందనలంటే.. కేటీఆర్ రియాక్షన్ ఏమంటే?

Update: 2021-01-21 09:48 GMT
సహజంగా నేతలపై కింది స్థాయి నేతలు, కార్యకర్తల్లో బోలెడంత అభిమానం, ఆప్యాయత ఉంటుంది. అందుకే తమ నేతనే సీఎం కావాలనే ఆకాంక్షను వారు వెలువరిస్తారు. తాజాగా తెలంగాణలో కేటీఆర్ సీఎం అవుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

కేసీఆర్ ప్లేసులో కేటీఆర్ సీఎం కాబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మంత్రులు తలసాని, ఈటల సైతం ఈ మధ్య 'కేటీఆర్ సీఎం అయితే తప్పేంటి?' అని ప్రశ్నించాడు.

ఇక కేటీఆర్ సీఎం అవ్వడానికి ముహూర్తం కూడా పెట్టేశారనే వార్తలు వస్తున్నాయి. మరి కేసీఆర్ మదిలో ఏముందో తెలియదు కానీ..  తాజాగా డిప్యూటీ స్పీకర్ పద్మారావు సైతం హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో 'కాబోయే సీఎం కేటీఆర్ కు శుభాకాంక్షలు' అంటూ బాంబు పేల్చారు.

ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకావడం.. ఆయన సమక్షంలోనే పద్మారావు ఈ వ్యాఖ్యలు చేయడంతో సీఎం మార్పు ఊహాగానాలకు బలం చేకూరుతోంది.

దక్షిణమధ్య రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ సికింద్రాబాద్ డివిజన్ కార్యాలయం ప్రారంభోత్సవంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఈ హాట్ కామెంట్స్ చేశారు. అతి త్వరలోనే సీఎం కాబోతున్న కేటీఆర్ కు శుభాకాంక్షలని.. కేటీఆర్ సీఎం అయ్యాక రైల్వే ఉద్యోగులని కాపాడాలని ఆకాంక్షిస్తున్నా అని పద్మారావు అన్నారు. గత రెండు రోజులుగా టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుండడంతో కేటీఆర్ సీఎం పక్కానా అన్న ఊహాగానాలు నడుస్తున్నాయి.

అయితే పక్కన ఉన్న మంత్రి కేటీఆర్ మాత్రం ఈ వ్యాఖ్యలను పట్టించుకోకుండా కేవలం రైల్వే ఉద్యోగులు, తెలంగాణలో రైల్వేల పరిస్థితి.. అన్యాయం చేస్తున్న కేంద్రం తీరును మాత్రమే కడిగేశారు. కేటీఆర్ సీఎం మాటలపై పెద్దగా స్పందించకపోవడం విశేషం. కేటీఆర్ మౌనం దేనికి సంకేతం అన్నది ఆసక్తి రేపుతోంది.
Tags:    

Similar News