శానిటైజర్ తాగి ఏపీలో మరో నలుగురు దుర్మరణం!

Update: 2020-08-08 05:15 GMT
ఆంధ్రప్రదేశ్ ‌లో శానిటైజర్ తాగి చనిపోయే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది.  ఏపీలో మద్యం ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో శానిటైజేర్ లో కూడా ఆల్కహాల్ శాతం ఉందని , తాగితే మత్తు వస్తుంది అని ప్రచారం జరగడంతో మందు కొనలేని వారు తక్కువ ధరలో చిక్కుతున్న శానిటైజర్ తాగుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా శానిటైజర్ తాగి తిరుపతిలో నలుగురు మృతి చెందారు. మృతులు లీలామహల్ సర్కిల్ వద్ద ఉండే పారిశుద్ధ్య కార్మికులుగా గుర్తించారు. మృతదేహాలు తిరుపతి రుయా మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం నిర్వహించనున్నారు.

మృతులు స్కేవెంజెర్ కాలనీకి చెందిన కార్మికులు వీరయ్య, వెంకట రత్నం, కుమార్, శ్రీనివాసులుగా గుర్తించారు. దీంతో ఆ  కాలనీలో విషాద చాయలు అలుముకున్నాయి.కాగా, గత కొన్నిరోజుల క్రితం ప్రకాశం జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లాలోని కురిచేడు, పామూరులో శానిటైజర్ తాగి 16 మంది ప్రాణాలు విడిచారు. మందు ధర ఎక్కువ కావడం , మద్యం అందుబాటులో ఉండకపోవడంతో  శానిటైజర్‌ తాగి వారు చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. అలాగే, కడప జిల్లా పెండ్లిమర్రిలో శానిటైజర్ తాగిన ఘటనలో ముగ్గురు చనిపోయారు.

ఇకపోతే , రాష్ట్రవ్యాప్తంగా శానిటైజర్ అమ్మకాలు, బెల్టుషాపులు, నాటుసారా తయారీ కేంద్రాలపై స్పెషల్‌ ఎన్ ‌ఫోర్స్‌ మెంట్‌ బ్యూరో ) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్న 345 ప్రాంతాలను గుర్తించారు. శానిటైజర్లు తాగుతున్న144 మందిని గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చారు.
Tags:    

Similar News