• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మరో వైరస్ కు జన్మనిచ్చిన...

మరో వైరస్ కు జన్మనిచ్చిన చైనా: భవిష్యత్ లో పొంచి ఉన్న ప్రమాదం

By - Tupaki Desk
Update: 2020-07-06 00:30 GMT
ఇప్పటికే ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ పుట్టుకకు కారణమైన చైనా మరో వైరస్ కు జన్మనిచ్చింది.  ప్రస్తుతం మహమ్మారి వైరస్ పై చైనాను ప్రపంచ దేశాలన్నీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఈ సమయంలోనే మరో వైరస్ ను చైనాలో గుర్తించారు. ఆ దేశంలో సరికొత్త వైరస్‌ ఒకదాన్ని శాస్త్రవేత్తలు పందుల్లో గుర్తించారు. దాని పేరు జీ4. ఇప్పటికి ఈ పేరుతో పిలుస్తున్నారు. అయితే మనుషులందరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ వైరస్‌ ప్రస్తుతానికి మనుషులకు సోకే అవకాశం లేదు. భవిష్యత్తులో మాత్రం ఇది మహమ్మారిగా మారే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

పందుల్లో అటు పక్షి సంబంధ - ఇటు క్షీరద సంబంధ వైరస్‌ లు రెండూ ఉంటాయి. ఇలా రెండు రకాల వైరస్‌ లు ఒకే జంతువులో ఉన్నప్పుడు ఒకదాంట్లోని జన్యువులు ఇంకో దాంట్లోకి చేరుతుంటాయి. ఫలితంగా కొత్త రకాల వైరస్‌ లు పుడుతుంటాయి. ఇవి ఏదో ఒక దశలో జంతువుల నుంచి క్షీరదాలైన మనుషులకూ సోకే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. చైనా వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని హోంగ్లీసన్‌ అనే శాస్త్రవేత్త ఇటీవల పందులపై జరిపిన పరిశోధనల ద్వారా జీ 4 వైరస్ ఉనికి బహిర్గతమైంది. దీంట్లో కనీసం మూడు ఇన్‌ఫ్లుయెంజా కారక వైరస్‌ ల జన్యు పదార్థం కలిసిపోయి ఉందని తెలిపారు.

యూరప్ - ఆసియా పక్షుల్లోని వైరస్‌ ఒకటి కాగా - ఎగిరే పక్షులు - మనుషులు - పందుల వైరస్‌ లు కలిగి ఉన్న నార్త్‌ అమెరికన్‌ రకం మరొకటని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ.వైరస్ పై 2011- 2018 మధ్యకాలంలో హోంగ్లీసన్‌ పది చైనా ప్రావిన్స్‌ల్లోని జంతు వధశాలల్లో నమూనాలు సేకరించారు. పందుల ముక్కుల్లోని స్రావాల నమూనాలు సేకరించి పరిశోధనలు చేశారు. ఈ క్రమంలోనే శ్వాస సంబంధ సమస్యలున్న వెయ్యి పందుల నమూనాలను కూడా విశ్లేషించారు. వీటిలో జీ 4తోపాటు కనీసం 179 ఇన్‌ ఫ్లుయెంజా కారక వైరస్‌ లు ఉన్నాయని, 2016 తరువాత సేకరించిన నమూనాల్లో ఇవి మరిన్ని ఎక్కువున్నాయని శాస్త్రవేత్త హోంగ్లీసన్‌ వివరించారు.  జీ 4 ఇప్పటికే మనుషులకు సోకుతున్నా అది మహమ్మారి స్థాయిలో లేదని తెలిపారు. అయితే ఇది భవిష్యత్తులో మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.
   

Tags:    
  • Flu virus 
  • China 
  • Telugu News 

Similar News

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS