విశాఖ షిప్పింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాదం

Update: 2020-08-08 16:00 GMT
విశాఖను  ప్రమాదాలు వెంటాడుతున్నాయి. వరుసగా ఏదో ఒక ప్రమాదం చోటుచేసుకుంటూ విశాఖలో కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా విశాఖలో మరో ప్రమాదం చోటుచేసుకుంది.

విశాఖ ఫిషింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.  ఓ చేపల బోటులో మంటలు చెలరేగాయి. సముద్రంలోనే ఆ బోటు తగలబడింది. ప్రమాదం జరిగిన సమయంలో ఐదుగురు మత్య్సకారులున్నారు. వారు సముద్రంలోకి దూకడంతో ప్రాణాపాయం తప్పింది. కొంతమందికి గాయాలయ్యాయి.

హార్బర్ లో ఓ బోటు శనివారం ఉదయం 5 గంటలకు చేపల వేటకు వెళ్లింది. తిరిగి వస్తున్న సమయంలో బోటులో ఉన్న పట్టిన చేపలను వేరు చేస్తుండగా ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. బోటులో మంటలను చూసిన ఇతర బోట్ల వారు వెంటనే అక్కడకు వెళ్లారు. పోర్టు అధికారులకు సమాచారం ఇచ్చారు.

కాగా బోటులో సిలిండర్లు కూడా ఉన్నాయి అవి పేలకపోవడంతో పెద్ద ఘోర ప్రమాదం తప్పింది.ఈ మంటలకు బోటు ఇంజిన్, క్యాబిన్ దగ్గమైంది. రూ.30 లక్షల నుంచి రూ.50లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. విశాఖలో వరుస ప్రమాదాలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News