ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. సత్వరమే స్పందించిన ఫైర్ సర్వీస్
దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితులు దారుణంగా మారాయి. ఆదివారం ఉదయం తెల్లవారుతుండగానే ఢిల్లీవాసులు అగ్ని ప్రమాదం వార్తతో నిద్రలేచారు. ఢిల్లీలోని బవానా పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న కార్డ్ బోర్డ్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించింది. దట్టమైన పొగలు - మంటలు వ్యాపించాయి. దీంతో అక్కడి స్థానికులు ఆందోళనకు గురయ్యారు. విశాఖపట్టణంలో స్టైరిన్ గ్యాస్ లీక్ మాదిరి సంఘటన చోటుచేసుకుందోమోనని భయభ్రాంతులకు లోనయ్యారు. అయితే అగ్ని ప్రమాదం వార్త అని తెలిసి కొంత ఊరట చెందారు.
అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించింది. 14 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేశారు. భారీగా చెలరేగుతున్న మంటలను ఫైర్ ఇంజన్లు అదుపులోకి తెచ్చారు. సమాచారం అందగానే వెంటనే స్పందించి ప్రమాద స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చినట్లు ఢిల్లీ అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.
అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదంతో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించిందని తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.