కేసీఆర్ ఎంత మేధావో చెప్పేసిన ఆర్థిక సర్వే
ఒక్కొక్కరు ఒక్కోలా పాలిస్తారు. పాలకుల పాలనాతీరు ఎలా ఉన్నా.. ప్రజలకు మేలు చేయాలన్నవారి తపన కొత్త పథకాలకు తెర తీయటమే కాదు.. కొన్ని సందర్భాల్లో దేశాన్నే ప్రభావితం చేస్తుంటారు. దివంగత మహానేత వైఎస్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో ఆయన హయాంలో వచ్చిన 108 అంబులెన్స్ లు తర్వాతి రోజుల్లో దేశ వ్యాప్తంగా అమలు చేయటమే కాదు.. అధికారంలోకి ఎవరొచ్చినా.. తప్పని సరిగా ఆ సేవల్ని కొనసాగించక తప్పని పరిస్థితి.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పలు సంక్షేమ పథకాల్ని ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఆయన తీసుకొచ్చిన పథకాల్లో ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాంగా రైతుబంధు పథకాన్ని చెప్పక తప్పదు. తెలంగాణలో అమలు చేసిన ఈ పథకాన్ని తర్వాతి రోజుల్లో ఏపీతో పాటు పలు రాష్ట్రాలే కాదు.. కేంద్ర ప్రభుత్వం కూడా ఫాలో అయినా.. తనదైన మసాలాను కలిపి కొత్త పథకంగా ప్రకటించటం తెలిసిందే.తాజాగా కేంద్రంలోనిమోడీ సర్కారు ప్రవేశ పెట్టిన ఆర్థిక సర్వేలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించటమే కాదు.. భేష్ అంటూ కీర్తించిన వైనం చూసినప్పుడు కేసీఆర్ మొనగాడితనం ఏమిటో ఇట్టే అర్థం కాక మానదు.
ప్రతి వ్యవసాయ సీజన్ కు ముందు విత్తనాలు.. ఎరువుల కోసం పట్టాదారులైన రైతులకు ఎకరానికి రూ.4వేలుచొప్పున పెట్టుబడి సాయం అందించే వినూత్న పథకానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని.. 2018 ఖరీఫ్ నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తుందని చెప్పారు. ఈ సాయాన్ని 2019-20 లో రూ.5వేలకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావించింది. రైతులను ఆదుకునేందుకు.. వారికి దన్నుగా నిలవటం కోసం తీసుకొచ్చిన ఈ పథకాన్ని ప్రశంసించింది. తన మేధావితనం ఎంతన్న విషయాన్ని కేసీఆర్ చెప్పుకోవటం కాదు.. ఆ విషయం తాజా ఆర్థిక సర్వేలో కేంద్రమే చెప్పిన వైనం గులాబీ బాస్ కు ఫుల్ ఖుషీ చేస్తుందని చెప్పక తప్పదు.