వీధి పోరాటాలకు దిగిన బాబు.. జగన్ బ్యాచ్

Update: 2015-12-01 04:01 GMT
అధికార.. విపక్షాల మధ్య ఘర్షణ మామూలే. సమకాలీన రాజకీయాల్లో అధిపత్య పోరు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘర్షణలు తీవ్ర రూపు సంతరించుకుంటున్నాయి. పార్టీల మధ్య విభేదాలు వీధి పోరాటాలుగా మారటం రాయలసీమలో కాస్త కామనే అయినా.. కోస్తాలో కాస్త తక్కువే. కానీ.. ఇప్పుడా పరిస్థితి మారింది. ఏపీ అధికారపక్షం .. విపక్షాల మధ్య వీధి పోరాటాలు ముదురుతున్నాయి. తాజాగా కోస్తాలో గొడవలు పెరుగుతున్నాయి.

ప్రశాంతంగా ఉండే గోదావరి జిల్లాల్లోనూ ఈ మధ్య ఉద్రిక్తలు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం మోర్తలో సోమవారం రాత్రి ఇరు వర్గాల మధ్య గొడవ మొదలైంది. ఇది కాస్తా.. పెను ఘర్షణగా రూపుదిద్దుకుంది. తెలుగుదేశం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల తాజాగా చోటు చేసుకున్న ఘర్షణలు తీవ్రరూపం దాల్చి.. మోర్తలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణంగా మారింది.

ఈ రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణల కారణంగా.. ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గొడవల గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన గ్రామానికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రుల్లో చేర్చటంతో పాటు.. ప్రస్తుతం మోర్త గ్రామంలో 144 సెక్షన్ ఆంక్షలు విధించారు. ప్రస్తుతం వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పటికీ.. పరిస్థితి మాత్రం లోలోన ఉద్రిక్తతతో ఉడికిపోతుందని చెబుతున్నారు.
Tags:    

Similar News