• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బాబుకు చుక్కలు...

బాబుకు చుక్కలు చూపిస్తున్న ఆ ఇద్దరు

By - Tupaki Desk
Update: 2017-05-23 09:20 GMT
చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న తెలుగుదేశం పార్టీలో గ్రూపుల గోల మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో తగాదాలు ఆయనకు తలనొప్పులు తెస్తున్నాయి. వైసీపీ నుంచి టీడీపీలోకి తీసుకొచ్చిన గొట్టి పాటి రవి - టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం వర్గాల మధ్య రచ్చ నిత్యం రావణ కాష్ఠంలా రగులుతోంది. రీసెంటుగా అక్కడ జరిగిన జంట హత్యల గొడవ ఆగకముందే అదే నేపథ్యంలో ఈ రెండు వర్గాలు మంత్రుల ముందే మరోసారి తన్నుకున్నంత పని చేశాయి.
    
మంగళవారం ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్ష ఎన్నిక సందర్భంగా ఎమ్మెల్సీ కరణం బలరాం - ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఎన్నికల పరిశీలకులుగా వచ్చిన మంత్రులు నారాయణ - సునీత - శిద్ధా రాఘవరావుల సమక్షంలోనే వైరివర్గాలు తోపులాటకు దిగడంతో ఉద్రిక్తత తలెత్తింది.
    
ఇటీవల వేమవరంలో చోటుచేసుకున్న జంటహత్యలు.. గొట్టిపాటి రవికుమారే చేయించారని కరణం వర్గీయులు నినదించారు. ఆ వెంటనే గొట్టిపాటి అనుచరులు.. కరణం వర్గీయులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరుపక్షాలమధ్య తోపులాట, ఘర్షణ జరిగింది. ఎంత వారించినా కార్యకర్తలు  వినకపోవడంతో మంత్రులు సహా ముఖ్యనేతలంతా ఏమీ చేయలేక ప్రేక్షక పాత్ర వహించారు.
    
అయితే... మంత్రులు వెంటనే సమాచారాన్ని చంద్రబాబుకు చేరవేయగా ఆయన కూడా ఏం చేయాలో అర్థం కాక ఆ ఇద్దరితో వేగలేకపోతున్నానని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.  ఈ గొడవలను ఎలా సద్దుమణచాలనే విషయంలో ఆయన త్వరలో సీనియర్ నేతలతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.


Tags:    
  • Karanam Balaram 
  • Gottipati Ravi Kumar 
  • Telugu NEWs 

Similar News

మూడు ముళ్ల బంధం.. రూ. 7.50 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

2026-11-19 19:30 GMT

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

Copyright @2026

Powered by Blink CMS