• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రేవంత్ రెడ్డిని కలిశానని...

రేవంత్ రెడ్డిని కలిశానని బాంబు పేల్చిన ఈటల రాజేందర్

By - Tupaki Desk
Update: 2021-10-23 16:30 GMT
టీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ అన్నట్టే హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రహస్యంగా కలిశారని తేటతెల్లమైంది. ఎట్టకేలకు దుమారం రేపిన ఈ వ్యవహారంలో ఈటల రాజేందర్ ఎట్టకేలకు నిజం ఒప్పుకున్నారు.

ఇటీవలే తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ గోల్కొండ రిసార్ట్ లో ఈటల, రేవంత్ రహస్యంగా కలిశారని.. అందుకు ఆధారాలు ఉన్నాయని.. బీజేపీ-కాంగ్రెస్ హుజూరాబాద్ లో కలిసిపోయారని సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందన్నారు. కాంగ్రెస్ అందుకే డమ్మీ అభ్యర్థిని నిలిపిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి.

ఈ క్రమంలోనే ఈటల రాజేందర్ ఈ ప్రకటనపై స్పందించారు. రేవంత్ రెడ్డిని తను కలిసింది నిజమేనని ఈటల అంగీకరించారు. అయితే తాను ఇప్పుడు కలిశాననడంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. మంత్రి పదవికి, టీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత మాత్రమే తాను రేవంత్ రెడ్డిని కలిసినట్టు ఈటల చెప్పడం విశేషం.

టీఆర్ఎస్ కు రాజీనామా చేశాక తాను అన్ని పార్టీల నాయకులను కలిసినట్టు ఈటల చెప్పుకొచ్చారు. ఇందులో తప్పేంటని ఆయన ప్రశ్నించారు. అభివృద్ధి విషయమై చర్చించేందుకు అన్ని పార్టీల నాయకులను కలవడం సహజమే అన్నారు. తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ నాయకులు ఇతర పార్టీల సహకారం తీసుకోలేదా? అని ఈటల ప్రశ్నించారు.

ఇక ఇదే విషయంపై బీజేపీ నేత జితేంద్రరెడ్డి స్పందించారు. రేవంత్, ఈటల కలిస్తే తప్పేంటని ప్రశ్నించడం విశేషం. ఏదైనా పనిపై వారు కలవవచ్చని తెలిపారు. దాన్ని రాజకీయంగా చూడొద్దని తెలిపారు.
Tags:    
  • Etela Rajender 
  • Revanth Reddy 
  • Latest News 
  • Telugu News 
  • Tupaki Updates 

Similar News

ఇతరుల ఆనందమే కొలమానమా? జెన్ జెడ్ ను ఒత్తిడికి గురిచేస్తున్న సోషల్ మీడియా

2026-11-02 11:30 GMT

50 టీఎంసీల వరద..?! ‘మురసు’తో నిండనున్న పులిచింతల, నాగార్జునసాగర్

2026-11-02 11:04 GMT

దక్షిణాదికి బుల్లెట్ ట్రైన్.. బెంగళూరు నుంచి చెన్నైకి కేవలం 73 నిమిషాల్లోనే!

2026-11-02 10:24 GMT

తుఫాన్ల నెల నవంబర్.. అసలు కారణాలు ఏంటి?

2026-11-02 10:00 GMT

అమెరికా ఎన్నికలతో భారత్‌కు కొత్త పరీక్ష.. ట్రంప్ ఓడితే భారత్ కు లాభమా? నష్టమా?

2026-11-02 10:00 GMT

రాప్తాడు ఉన్మాదికి పోలీసు శిక్ష.. కుళ్లిపోయిన కుడికాలు, తొలగించే అవకాశం!

2026-11-02 09:58 GMT

తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్.. అమిత్ షా ‘హైదరాబాద్ వ్యూహం’ గేమ్ ఛేంజర్ అవుతుందా?

2026-11-02 09:50 GMT

నెల్లూరుకు సమీపంలో ‘మురసు’.. ఐదు జిల్లాలలో భారీ వర్షాలు

2026-11-02 08:24 GMT

రాప్తాడు బాలిక హెల్త్ బులిటెన్.. కీలక సమాచారం వెల్లడించిన మంత్రి లోకేశ్

2026-11-02 07:56 GMT

ఓడిపోతానని ట్రంప్ కు జ్ఞానోదయం.. ఇన్నాళ్లకు తెలిసి (తెలివి) వచ్చింది..

2026-11-02 07:05 GMT

మారథాన్‌లో విజయం.. జీవితంలో విషాదం.. పరుగుపందెం పూర్తి చేసి ప్రాణాలు విడిచిన టెక్కీ

2026-11-02 06:43 GMT

తొలిరోజే రూ.68 లక్షల జరిమానాలు.. ఢిల్లీలో కాలుష్యంపై యుద్ధం..

2026-11-02 05:28 GMT

Copyright @2026

Powered by Blink CMS