కరోనా సోకితే అంగస్తంభన సమస్యలు!

Update: 2020-12-07 12:30 GMT
కరోనా కల్లోలం ప్రపంచాన్ని ఇంకా వీడలేదు. సెకండ్ వేవ్ తో అది మరింత తీవ్రమవుతోంది. ఒకసారి వచ్చిపోయిన వారికి కూడా మరోసారి వస్తున్న కేసులు వెలుగుచూశాయి. భారత్ లోనూ ఈ పరిస్థితి కనిపిస్తోంది.

కరోనా లక్షణలు రోజురోజుకు కొత్త కొత్తవి వెలుగుచూస్తున్నాయి. కరోనా బారిన పడిన వారి శరీరాన్ని ఆ వైరస్ గుల్ల చేస్తుందనే వార్తలు కూడా కలవరపెడుతున్నాయి. తాజాగా మరో షాకింగ్ విషయం వెలుగుచూసింది.

వైరస్ సోకి దాని నుంచి బయటపడిన వారు దీర్గకాలిక సమస్యలతో బాధపడుతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కోవిడ్ బారినపడిన పురుషుల్లో అంగస్తంభన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు.

అంటువ్యాధుల నిపుణులైన డాక్టర్ డేనా గ్రేసన్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. కోవిడ్ బారిన పడి కోలుకున్న తర్వాత సంబంధిత వ్యక్తుల్లో రక్తనాళ వ్యవస్థలో సమస్యలకు కారణమవుతుందని ఆయన తెలిపారు. దీని ఫలితంగా పురుషుల్లో అంగస్తంభన సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

కరోనా మనుషులను కబళించడమే కాదు.. ఇప్పుడు కోరుకున్న వారికి ధీర్ఘకాలిక, అంగస్తంభన సహా పలు సమస్యలకు కారణమవుతోందని నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సిన్లు వస్తే కానీ దీనికి అడ్డుకట్ట పడే అవకాశాలు కనిపించడం లేదు.
Tags:    

Similar News