మద్రాస్ హైకోర్టులో ఏదో జరుగుతోంది.. సుప్రీం కీలక వ్యాఖ్యలు విన్నారా?

రెండు తెలుగు రాష్ట్రాలకు భిన్నంగా తమిళనాడు హైకోర్టు బెంచ్ లు ఉన్నాయి. మద్రాసు హైకోర్టుతో పాటు మదురైలోనూ ప్రధాన బెంచ్ ఉంది.;

Update: 2025-12-13 10:30 GMT

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అరుదైన వ్యాఖ్యలు చేసింది. తన పరిధిలో నడిచే హైకోర్టులో ఏదో జరుగుతుందన్న అనుమానాన్ని వ్యక్తం చేసింది. ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అంశం ఏమంటే.. ఇదే హైకోర్టు మీద గతంలోనూ తన అసంతృప్తిని వ్యక్తం చేయటం. తమిళ స్టార్ హీరో విజయ్ 2024 మొదట్లో (ఫిబ్రవరి)లో టీవీకే (తమిళగ వెట్రి కజగం) పేరుతో రాజకీయ పార్టీని ఏఱ్పాటు చేయటం తెలిసిందే. సెప్టెంబరు 27న విజయ్ పార్టీ నిర్వహించిన పొలిటికల్ ర్యాలీలో భారీ ఎత్తున తొక్కిసలాట జరగటం.. 41 మంది మరణించటం.. వంద మంది వరకు గాయపడటం తెలిసిందే. ఈ ర్యాలీకి అనుమతించిన దాని కంటే ఎక్కువగా హాజరుకావటం కూడా తొక్కిసలాటకు ప్రధాన కారణంగా చెప్పటం తెలిసిందే.

ఈ ఉదంతంపై అధికార డీఎంకే వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉంటే.. ఈ ఘటనకు సంబందించిన కేసు విచారణపై తాజాగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసుల విచారణ.. లిస్టింగ్ ల వ్యవహారంలో మద్రాసు హైకోర్టులో ఏదో తప్పిదం జరుగుతోందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మద్రాస్ హైకోర్టు రిజిస్ట్రాన్ జనరల్ అందించిన రిపోర్టును పరిశీలించిన క్రమంలో సుప్రీం ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం.

ఇంతకూ సుప్రీంకోర్టు ఈ విషయాన్ని ఎందుకు జోక్యం చేసుకుందన్న విషయంలోకి వెళితే.. కరూర్ తొక్కిసలాట ఘటనపై ప్రత్యేక దర్యాప్తు టీం (సిట్)ను ఏర్పాటు చేయాలని మద్రాసు హైకోర్టు ఆదేశించటాన్ని విజయ్ నేత్రత్వంలోని టీవీకే పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎందుకిలా? అంటే.. కారణం లేకపోలేదు. కరూర్ విషాద ఘటన జరిగింది మదురై హైకోర్టు బెంచ్ పరిధిలో. కానీ.. చెన్నై బెంచ్ ఎందుకు సిట్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసిందన్నది ప్రశ్నగా మారింది.

రెండు తెలుగు రాష్ట్రాలకు భిన్నంగా తమిళనాడు హైకోర్టు బెంచ్ లు ఉన్నాయి. మద్రాసు హైకోర్టుతో పాటు మదురైలోనూ ప్రధాన బెంచ్ ఉంది. తమిళనాడు మొత్తానికి న్యాయస్థానాలుగా పని చేయటమే కాదు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి కూడా ఈ హైకోర్టుల పరిధిలోనే ఉంటాయి. కరూర్ తొక్కిసలాట ఉదంతంపై ఏమైనా స్పందించాలన్నా.. ఆదేశాలు జారీ చేయాలన్నా మదురై హైకోర్టు బెంచ్ రియాక్టు కావాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా మద్రాసు హైకోరటు జోక్యం చేసుకోవటం సిట్ ఏర్పాటు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ విజయ్ పార్టీ సుప్రీంను ఆశ్రయించింది.

ఈ సందర్భంగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. మదురై హైకోర్టు బెంచ్ పరిధిలోని అంశాన్ని మద్రాసు హైకోర్టు జోక్యం చేసుకోవటంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. అంతేకాదు.. రోడ్ షోలు నిర్వహించటానికి మార్గదర్శకాల్ని కోరుతూ పిటిషన్ దాఖలైతే.. సిట్ తో దర్యాప్తు ఆదేశాలను సుప్రీంకోర్టు తప్ప పట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసుల విచారణ లిస్టింగ్ లపై విజయ్ పార్టీ సుప్రీంను ఆశ్రయించింది. దీనికి సంబంధించిన వివరాల్ని తెప్పించుకున్న సుప్రీంకోర్టు.. మద్రాసు హైకోర్టులో ఏదో తప్పిదం జరుగుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

మద్రాసు హైకోర్టు అనురిస్తున్న నియమాల్ని తాము పరిశీలిస్తామని.. రిజిస్ట్రార్ జనరల్ అందించిన రిపోర్టును పిటిషన్ దాఖలు చేసిన వారితో పంచుకొని వారి స్పందన తీసుకోవాలని ఆదేశించింది. ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మద్రాసు హైకోర్టులో ఏదో తప్పిదం జరుగుతుందన్న అరుదైన వ్యాఖ్యల్ని సుప్రీంకోర్టుకు చెందిన జస్టిస్ జేకే మహేశ్వరి.. జస్టిస్ విజయ్ బిష్ణోయ్ లతో కూడిన ధర్మాసనం చేసింది. మొత్తంగా కరూర్ తొక్కిసలాట ఉదంతం విచారణకు సంబంధించి మద్రాసు హైకోర్టు తీరు చర్చనీయాంశంగా మారటం గమనార్హం.

Tags:    

Similar News