కేరళ స్టోరీ 2 రిలీజ్ పై కోర్టులో ఏం జరిగింది?
సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు కోర్టును ఆశ్రయిస్తూ.. విడుదలను నిలుపుదలకు ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్లు కోరటం.. అందుకు స్పందించిన సింగిల్ జడ్జి సినిమా విడుదలపై 15 రోజుల స్టే విధించింది.;
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై.. సంచలనంగా మారటమే కాదు.. పెను దుమారాన్ని రేపిన చిత్రం ది కేరళ స్టోరీ 1. దీనికి కొనసాగింపుగా ది కేరళ స్టోరీ 2.. గోస్ బియాండ్ మూవీని రూపొందించారు. షెడ్యూల్ ప్రకారం ఈ మూవీని శుక్రవారం (ఫిబ్రవరి 27) విడుదల కావాల్సి ఉంది. అయితే.. ఈ చిత్ర విడుదలను అడ్డుకోవాలని కోరుతూ ముగ్గురు పిటిషనర్లు వేర్వేరుగా కేరళ హైకోర్టును ఆశ్రయించారు. అనంతరం పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి.
సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు కోర్టును ఆశ్రయిస్తూ.. విడుదలను నిలుపుదలకు ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్లు కోరటం.. అందుకు స్పందించిన సింగిల్ జడ్జి సినిమా విడుదలపై 15 రోజుల స్టే విధించింది. దీనిపై పెద్ద ఎత్తున వార్తలు వెలువడినప్పటికీ.. ఆ తర్వాత చిత్ర నిర్మాతలు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించటం.. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను నిలిపి వేసి.. విడుదలకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనిపై ఇరు వర్గాల మధ్య పెద్ద ఎత్తున వాదనలు చోటు చేసుకున్నాయి. అనంతరం డివిజన్ బెంచ్ ఏమంది? సినిమా విడుదల వ్యవహారం ఏం కానుంది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ముందు.. ఈ చిత్రం విడుదలకు సంబంధించి గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కోర్టులో చోటు చేసుకున్న పరిణామాల్నితెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
కేరళ స్టోరీ 2 సినిమా విడుదలను అడ్డుకునేందుకు కేరళ హైకోర్టును ఆశ్రయించారు ముగ్గురు పిటిషనర్లు. వారి వివరాల్లోకి వెళితే.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తికి కేవలం 26 ఏళ్లు మాత్రమే. అతని పేరు శ్రీదేవ్ నంబూద్రి. కన్నూర్ కు చెందిన ఇతను బయాలజిస్ట్ గా తనను తాను పేర్కొన్నారు. సినిమా టైటిల్.. టీజర్ లో అబ్ సహేంగే నహీ.. లఅడెంగే అన్న డైలాగ్ పై తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఇంతకూ ఆ డైలాగ్ అర్థమేమంటే.. ఇక భరించం.. పోరాడుతామని. ఈ డైలాగ్ మత విద్వేషాలను ప్రేరేపించేలా ఉందని పేర్కొన్నారు.
రెండో పిటిషన్ ను దాఖలు చేసిన వ్యక్తి ఫ్రెడ్డీ వి. ఫ్రాన్సిస్. ఈ మూవీ కేరళ ప్రతిష్ఠను దెబ్బ తీసేలా ఉందని.. తప్పుడు ప్రచారంతో సమజాంలో చీలిక తీసుకొచ్చే అవకాశం ఉందన్నది ఆయన వాదన. ఇక.. మూడో పిటిషనర్ అతుల్ రాయ్. అయితే.. ఇతని పిటిషన్ కు సంబంధించి కోర్టు సరైన వాదన లేవంటూ కొట్టేసింది. ఈ సినిమా విడుదలను అడ్డుకుంటూ దాఖలైన పిటిషన్లపై వాదనలు జరిగినప్పుడు ఒక అంశం చుట్టూ ప్రధానంగా వాదనలు జరిగాయి. అదేమంటే.. సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు కోర్టును ఆశ్రయించటం సరైన చర్యేనా? అన్నది ప్రశ్నగా మారింది. ఇదే విషయం కోర్టు వాదనల్లో ప్రధానంగా నడిచింది. దీనికి నిర్మాతల వాదన చూస్తే..
‘సినిమా విడుదల కోసం ఇప్పటికే థియేటర్ల ఒప్పందాలు.. ఓవర్సీస్ రైట్స్ అన్నీ పూర్తయ్యాయి. ఆఖరి నిమిషంలో స్టే కారణంగా కోట్లాది రూపాయిల నష్టం వాటిల్లుతుంది. గతంలో సుప్రీంకోర్టు , బాంబే హైకోర్టులు సైతం సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు కోర్టును ఆశ్రయించటం ఆమోదయోగ్యం కాదు’ అంటూ వ్యాఖ్యానించిన అంశాలను నిర్మాతల తరఫు న్యాయవాది గుర్తు చేశారు. అంతేకాదు.. నిపుణుల కమిటీ సినిమాను ఒకసారి చూసి.. సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత.. కోర్టులు జోక్యం చేసుకోవటం భావప్రకటనా స్వేచ్ఛకు విరుద్ధంగా పేర్కొన్నారు.
నిర్మాతల వాదనకు భిన్నంగా పిటిషనర్లు.. సింగిల్ బెంచ్ జడ్జి పేర్కొన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ అనేది సమాజంలో శాంతికి విఘాతం కలిగించేలా ఉండకూడదని జస్టిస్ బెచు కురియన్ థామస్ అభిప్రాయపడ్డారు. కేరళలో అన్ని మతాల వారు కలిసే ఉంటున్నారని.. ఈ సినిమా టీజర్ కేరళ అంతటా ఉగ్రవాదం.. మత మార్పిడులు జరుగుతున్నట్లుగా తప్పుగా చూపిస్తోందని కోర్టు పేర్కొంది. సెన్సార్ బోర్డు బాధ్యతారహితంగా సర్టిఫికేట్ ఇచ్చినట్లుగా కోర్టు నిర్దారించింది. దీంతో చిత్ర వివాదానికి సంబంధించిన ప్రాథమిక మార్గదర్శకాలనుపాటించలేదంటూ స్టే విధించింది.
ఈ నేపథ్యంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల్నితప్పు పడుతూ.. హైకోర్టును డివిజన్ బెంచ్ ను పిటిషన్లు వాదించారు. అందుకు తగ్గట్లే యుద్ధ ప్రాతిపదిక మరోవర్గం అడ్డుకుంటూరని పేర్కొంటూ పెద్ద ఎత్తున వాదనలు వినిపించారు. సింగిల్ జడ్జి ఇచ్చిన మార్గదర్వకాల్ని చూపగా.. వాటిని పరిశీలించిన డివిజన్ బెంచ్ (జస్టిస్ ఎస్.ఎ. ధర్మాధికారి, జస్టిస్ పీవీ బాలక్రిష్ణన్) కీలక వ్యాఖ్యలు చేశారు.
సినిమా విడుదలకు కేవలం కొన్ని గంటల ముందు సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికేట్ ను కాదని 15 రోజుల స్టే విధించటం చాలా తొందరపాటు చర్యగా పేర్కొంటూ.. ‘చాలా తొందరపాటుతో కూడిన నిర్ణయం. ఒక సినిమాను విడుదలకు కొన్ని గంటల ముందు స్టే ఇవ్వటానికి చాలా బలమైన కారణాలు ఉండాలి. సింగిల్ జడ్జి ఈ విషయంలో తన పరిధిని మించి వ్యవహరించారు’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా విడుదల కోసం ఇప్పటికే భారీగా ఖర్చు చేశారని..ఆఖరి నిమిషంలో ఇలా అడ్డుకోవటం వల్ల నిర్మాతలకు కోలుకోలేని నష్టం వాటిల్లుతుందన్న వాదనను బెంచ్ పరిగణలోకి తీసుకుంది.
ప్రాథమికంగా సినిమాను చూడకుండానే నిర్ణయాలు తీసుకోవటం సరి కాదని బెంచ్ వ్యాఖ్యానించింది.శుక్రవాం ఉదయం సింగిల్ జడ్జి నిర్ణయాన్ని డివిజన్ బెంచ్ తప్పు పట్టి.. విడుదలకు మార్గం సుగమం అవుతుందా? లేదంటే.. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల్ని కంటిన్యూ చేస్తుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఒకవేళ సింగిల్ జడ్జి ఉత్తర్వును రద్దు చేస్తే సినిమా విడుదలకు మార్గం సుగమం అయినట్లే. ఒకవేళ.. డివిజన్ బెంచ్ లోనూ తిరస్కారం ఎదురైతే.. నిర్మాతలు వెనువెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించే వీలుంది. అదే జరిగితే.. సినిమా విడుదల సుప్రీంకోర్టు డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఏం జరిగినా.. కేరళ స్టోరీ 2 కోసం లక్షలాది మంది ఎదురు చేస్తున్నారని చెప్పక తప్పదు. కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ ఏ రీతిలో రియాక్టు అవుతుందో మరికొద్ది గంటలలో తేలిపోనుంది.