టీహైకోర్టు క్లారిటీ: విటులంతా నేరస్థులు కాదు!

ఒక కీలక అంశానికి సంబంధించి తాజాగా తెలంగాణ హైకోర్టు పూర్తి స్పష్టత ఇవ్వటంతో పాటు.. సె*క్స్ వర్కర్ల వద్దకు వెళ్లే విటులు నేరస్థులా? కాదా? అన్న అంశంపై తన తీర్పు ఇచ్చిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Update: 2026-06-12 05:30 GMT

ఒక కీలక అంశానికి సంబంధించి తాజాగా తెలంగాణ హైకోర్టు పూర్తి స్పష్టత ఇవ్వటంతో పాటు.. సెక్స్ వర్కర్ల వద్దకు వెళ్లే విటులు నేరస్థులా? కాదా? అన్న అంశంపై తన తీర్పు ఇచ్చిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సాధారణంగా సె*క్స్ వర్కర్ల వద్దకు వెళ్లిన విటుల మీద కేసులు నమోదు చేయటం.. వారిని అదుపులోకి తీసుకోవటం లాంటివి చేస్తుండటం తెలిసిందే. అయితే.. తాజాగా ఈ తరహా కేసులకు సంబంధించిన విచారణలో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీని ప్రకారం సె*క్స్ వర్క్ వృత్తిని ఇష్టపూర్వకంగా చేసే మహిళల వద్దకు వెళ్లే కస్టమర్లపై కేసు ఉండదని తేల్చి చెప్పింది. విటులంతా నేరస్థులు కాదని పేర్కొంది.

అయితే.. ఒక సె*క్స్ వర్కర్.. మానవ అక్రమ రవాణా బాధితురాలై ఉండటం.. ఆమెను బలవంతంగా సె*క్స్ వర్కర్ గా మార్చారని తెలిసినప్పటికి ఆమె వద్దకు కస్టమర్ వెళితే మాత్రం కేసు పెట్టొచ్చని పేర్కొంది. బలవంతంగా సె*క్స్ వర్కర్ గా పని చేయిస్తున్న వారి వద్దకు వెళ్లే విటుల విషయంలో మాత్రం ఐపీసీ సెక్షన్ 370ఏ(2) ప్రస్తుత బీఎన్ఎస్ 142, 144 సెక్షన్లు వర్తిస్తాయని పేర్కొంది.

అసలు తెలంగాణ హైకోర్టు ఈ అంశం మీద ఎందుకు స్పష్టత ఇవ్వాల్సి వచ్చిందన్న విషయంలోకి వెళితే.. సె*క్స్‌ వర్కర్‌ వద్దకు వెళ్లిన విషయంలో పోలీసులు తమపై మానవ అక్రమ రవాణా నిరోధక చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ 370(2) పెట్టినట్లుగా పేర్కొంటూ సుమారు 137 పిటిషన్లు దాఖలు అయ్యాయి.డబ్బులు చెల్లించి లైంగిక సేవలు తీసుకున్న కారణంగా తమపై ట్రాఫికింగ్‌ కేసులు పెట్టడం చెల్లదని, వాటిని కొట్టేయాలని నిందితులు కోరారు.

ఇక్కడే మరో అంశాన్ని ప్రస్తావిస్తే విషయం మరింత క్లారిటీ వస్తుందని చెప్పాలి. ఇంతకూ ఐపీసీ 370(2) ఏం చెబుతోంది? అన్నది చూస్తే.. మనుషుల అక్రమ రవాణా నేరానికి సంబంధించిన సెక్షన్. దీని ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తిని దోపిడీ లేదా దోపిడీ ప్రయోజనాల కోసం బెదిరింపులు.. బలవంతం.. అపహరణ.. మోసం లేదంటే అధికార దుర్వినియోగం ద్వారా రవాణా చేసినా.. ఆశ్రయం కల్పించినా.. స్వీకరించినా అది అక్రమ రవాణా నేరం కిందకు వస్తుంది.

ఈ నేరానికి పాల్పడిన వారికి ఏడేళ్ల కంటే తక్కువ కాకుండా.. పదేళ్ల వరకు పొడిగించే వీలున్న కఠిన కారాగార శిక్షతో పాటు ఫైన్ కూడా విధించే వీలుంది. ఇక ఐపీసీ సెక్షన్ 370ఏ(2) విషయానికి వస్తే.. ఒక వ్యక్తి వేరే ప్రాంతం నుంచి మోసపూరితంగా కానీ బలవంతంగా కానీ అక్రమ రవాణా చేశారని తెలిసి కూడా ఆ వ్యక్తిని లైంగిక దోపిడీకి ఉపయోగించుకున్న సందర్భంగా ఈ సెక్షన్ వర్తిస్తుంది.

తమపై పెట్టిన మానవ అక్రమ రవాణా సెక్షన్లు వర్తించవన్న పిటిషన్ల మీద విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం.. సాధారణ సెక్స్ వర్కర్ల వద్దకు వెళ్లిన కస్టమర్లకు మానవ అక్రమ రవాణా నిరోధక చట్టం వర్తించదని పేర్కొంది. అదే సమయంలో వారిపై నమోదు చేసే ఐపీసీ 370ఏ(2) వర్తిస్తుందా? లేదా అన్న స్పష్టతను ఇవ్వాలని పేర్కొంటూ డివిజన్ బెంచ్ కు రిఫర్ చేసింది. దీనిపై జస్టిస్ కె లక్ష్మణ్.. జస్టిస్ బీఆర్ మధుసూదన్ రావులతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ జరిపింది.

ఈ సందర్భంగా వారు ఈ అంశంపై పూర్తి స్పష్టత ఇచ్చారు. ఇష్టపూర్వకంగా సెక్స్ వర్కర్లుగా చేసే వారి వద్దకు వెళ్లే కస్టమర్ కు ట్రాఫికింగ్ కేసు వర్తించదని స్పష్టం చేసింది. ట్రాఫికింగ్ ద్వారా బలవంతంగా సెక్స్ వర్కర్ గా మారిన బాధితురాలిని లైంగికంగా దోపిడీ చేస్తున్నట్లు పరిస్థితులు ద్వారా అనిపిస్తే.. ఆ కస్టమర్ కు ఆమె ట్రాఫికింగ్ బాధితురాలు అని ముందే తెలిసి కూడా ఆమె వద్దకు వెళితే మాత్రం.. అలాంటి వారిపై ఐపీసీ సెక్షన్ 370ఏ(2) వర్తిస్తుందని చెప్పింది. అలా కాని పక్షంలో.. ఇష్టపూర్వకంగా చేస్తున్నట్లైయితే మాత్రం.. విటులపై కేసులు ఉండవని తేల్చింది.

Tags:    

Similar News