కోల్ కతా స్టేడియం ఫ్యాన్స్ విధ్వంసం.. సొరంగం నుంచి వెళ్లిపోయిన మెస్సీ

లో మెస్సీ టూర్ కు అభిమానులు పోటెత్తుతున్నారు. వారిని కంట్రోల్ చేయడం నానా కష్టమవుతోంది. ఈ తెల్లవారుజామున మెస్సీ భారత్ చేరుకున్నారు.;

Update: 2025-12-13 08:50 GMT

ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ వస్తున్నాడంటే ఉండే క్రేజ్ ఏంటో ఇప్పుడు భారత్ లో కనిపిస్తోంది. అర్ధరాత్రి దాటాక తెల్లవారుజామున 2.20కి మెస్సి దిగితే ఆయన కోసం చలిలో కోల్ కతా ఎయిర్ పోర్టు బయట అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆయన చూసేందుకు, కలిసేందుకు ఎగబడ్డారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో మెస్సీని వెనుక గేటునుంచి హోటల్ కు తరలించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. భారత్ లో మెస్సీ ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఉందో.. ఎలాంటి అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయో అర్థం చేసుకోవచ్చు.

ఇక మెస్సీ ఈరోజు కోల్ కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఫుట్ బాల్ మ్యాచ్ ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో అభిమానులు మెస్సీని చూసేందుకు తరలివచ్చారు. కాగా.. మ్యాచ్ సమయానికి మెస్సీ నిమిషాల్లోనే వెళ్లిపోవడం..ఫ్యాన్స్ కు అస్సలు నచ్చలేదు. దీంతో స్టేడియంలోనే విధ్వంసానికి దిగారు. కుర్చీలు ధ్వంసం చేశారు. స్టేడియంలోకి వాటర్ బాటిల్స్ విసిరిపారేశారు. ఫ్యాన్స్ ఆగ్రహంతో మెస్సి స్టేడియంలోని సొరంగం నుంచి వెళ్లిపోయిన పరిస్థితి ఎదురైంది. ఫ్యాన్స్ ను నియంత్రించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ప్రేక్షకులు స్టేడియంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిని పోలీసులు నియంత్రిస్తున్నారు. స్టేడియంలో గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి.

భారత్ లో మెస్సీ టూర్ కు అభిమానులు పోటెత్తుతున్నారు. వారిని కంట్రోల్ చేయడం నానా కష్టమవుతోంది. ఈ తెల్లవారుజామున మెస్సీ భారత్ చేరుకున్నారు. 14ఏళ్ల తర్వాత భారత్ లో పర్యటిస్తున్న మెస్సీ కోసం అభిమానులు పెద్ద సంఖ్యలో వేచిచూస్తున్నారు. మెస్సీ మేనియా కొనసాగుతోంది.

మెస్సీ భారత్ పర్యటనలో కోల్ కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులను కలువనున్నారు. హైదరాబాద్ లోనూ పర్యటించనున్నారు. కోల్ కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఫుట్ బాల్ మ్యాచ్ ను ఏర్పాటు చేశారు. అయితే మెస్సీ కోసం ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. స్టేడియంకు మెస్సీ వచ్చిన కొద్ది క్షణాల్లోనే వెళ్లిపోయారు. దీంతో స్టేడియంలోకి వచ్చి వేచిచూస్తున్న ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. గ్రౌండ్ లోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశారు. ఫ్యాన్స్ ఆగ్రహంతో మెస్సీ అక్కడనుంచి వెళ్లిపోయారు.

మెస్సీ సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్నారు. ఫలక్ నూమా ప్యాలెస్ లో బస చేస్తారు. నేటి రాత్రి మెస్సీ, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఇద్దరూ ఒకే మైదానంలో బరిలోకి దిగి ప్రజలను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈ మెస్సీ గోట్ టూర్.. సంగీత విభావరితో మొదలవనుంది. ఆ తర్వాత ఎగ్జిబిషన్ మ్యాచ్ మొదలవుతుంది. ఎగ్జిబిషన్ మ్యాచ్ లో ఆర్ఆర్ 9 వర్సెస్ మెస్సీ ఆల్ స్టార్స్ జట్లు తలపడనున్నాయి. 20 నిమిషాల పాటు జరిగే ఈ మ్యాచ్ లో ఆఖరి 5 నిమిషాల్లో మెస్సీ, రేవంత్ రెడ్డి మైదానంలోకి దిగుతారు. నిర్ణీత సమయం ముగిశాక రేవంత్, మెస్సీ పెనాల్టీ షూటౌట్ లు ఆడుతారు.ఇప్పటికే మెస్సీ పర్యటనల వేళ భారీ భద్రత ఏర్పాటు చేశారు. అభిమానులుసైతం పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో మెస్సీ మేనియా కొనసాగుతోంది.

మెస్సీ, ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పిన సీఎం

కోల్ కతా సాల్ట్ లేక్ స్డేడియం ఘటనపై సీఎం మమతా బెనర్సీ తీవ్ర విచారం ఆవేదన వ్యక్తం చేశారు. మెస్సీతోపాటు ఆయన అభిమానులకు క్షమాపణలు తెలియజేశారు. స్టేడియానికి రాకుండానే ఆమె వెనుదిరిగారు. స్టేడియం వద్ద నిర్వహణ లోపంపై ఎంక్వయిరీ కమిటీ వేస్తానన్నారు. మెస్సీ ని చూసేందుకు స్టేడియానికి భారీగా చేరుకున్న ఫ్యాన్స్ ఆయన్ను చూసే అవకాశం రాకపోవడంతో స్టేడియంలో విధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. దీనిపైనే మమతా స్పందించారు.



Tags:    

Similar News