భావోద్వేగానికి గురైన సీరం సీఈఓ .... వైరల్ అవుతున్న ఫోటో !
కరోనా వైరస్ .. దేశంలో ఈ మహమ్మారి విజృంభణతో దేశం మొత్తం హడలిపోయింది. గత ఏడాదిగా వ్యాక్సినేషన్ కోసం దేశం మొత్తం ఆతృతగా ఎదురుచూస్తున్న సమయంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ యొక్క ఫస్ట్ బ్యాచ్ వ్యాక్సిన్ రవాణా మొదలైంది .పూణేలోని సీరమ్ ఇన్స్టిట్యూట్ లో నిపుణుల బృందం అహర్నిశలు శ్రమించి తయారుచేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ప్రజల ఆరోగ్య రక్షణకు దేశ ప్రజలకు అందుబాటులోకి రావడంతో తన బృందానికి ఇది భావోద్వేగా క్షణం అని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సిఇఒ అదార్ పూనవల్లా ట్వీట్ చేశారు
భారతదేశపు మొట్టమొదటి కరోనావైరస్ వ్యాక్సిన్ అయిన కోవిషీల్డ్ యొక్క 56.5 లక్షల మోతాదును మంగళవారం ఉదయం సీరం ఇన్స్టిట్యూట్ నుండి నుండి ఢిల్లీ , చెన్నై, బెంగళూరు, లక్నో, కోల్‌కతా, గౌహతి మరియు పాట్నాతో సహా వివిధ నగరాలకు వెళ్ళింది . కోవిషీల్డ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో భావోద్వేగానికి గురైన అదార్ పూనవల్లా ట్వీట్ తో రెండు ఫోటోలను కూడా పంచుకున్నారు . సీరం ఇనిస్టిట్యూట్ లోని మొత్తం బృందం , వ్యాక్సిన్ రవాణా బాక్సులతో ట్రక్ వద్ద ఉన్న రెండు ఫోటోలను తన ట్వీట్ తో పాటు పంచుకున్నారు. ఏప్రిల్ 2021 నాటికి మొత్తం 5.60 కోట్ల మోతాదుల కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను మోతాదుకు 200 చొప్పున కొనుగోలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
వ్యాక్సిన్ 1.10 కోట్ల మోతాదులను సోమవారం కొనుగోలు చేయగా, ఏప్రిల్ 2021 నాటికి మరో 4.50 కోట్ల మోతాదులను కొనుగోలు చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రభుత్వం కోరిన మేరకు మొదటి 100 మిలియన్ మోతాదులకు 200 డాలర్ల ప్రత్యేక ధరను ఇచ్చినట్లు అదార్ పూనవల్లా తెలిపారు. దీనిపై స్పందించిన సీరం ఇన్స్టిట్యూట్ సీఈవో అదార్ పూనవల్లా కరోనా వ్యాక్సిన్ పై మొదట్లో లాభం పొందలేమని నిర్ణయించుకున్నాము. మొదట ప్రభుత్వం కోరిన మేరకు వ్యాక్సిన్లను అందించి, ఆ తరువాత మేము తిరిగి ధరను నిర్ణయిస్తామని, ప్రైవేటు మార్కెట్ లో వ్యాక్సిన్ 1 వెయ్యి రూపాయల చొప్పున విక్రయిస్తామని ఆయన తెలిపారు.