ఫేస్ బుక్ కు పంచ్ వేసిన అపర కుబేరుడు
ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంపన్నుల్లో ఒకరు ఎలాన్ మస్క్. పేరు విన్నంతనే ఆయన్ను గుర్తించేటోళ్లు చాలామందే ఉంటారు. కానీ.. టెస్లా సీఈవో అన్న మాట విన్నంతనే ఆయన రూపం కళ్ల ముందు కదలాడుతుంది. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల్లో ఒకటైన టెస్లాకు రథసారధిగా వ్యవహరించే ఆయన తీరు తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది.
తాజాగా ఆయన చేసిన ఒక వ్యాఖ్య ఫేస్ బుక్కు ఇబ్బందికరంగా మారింది. అపర కేబేరుల్లో ఒకరైన ఆయన అప్పుడప్పడుు ఎటకారంగా వ్యాఖ్యలు చేస్తుంటారు. ఆయన నోటి బారిన పడిన సోషల్ మీడియా సంస్థలు కొన్ని ఇబ్బంది పడుతుంటాయి. తాను అప్పుడప్పుడు వాడే ట్విట్టర్ ను సైతం ఆయన ఎటకారంగా వ్యాఖ్యలు చేస్తుంటారు. ఒక దశలో ట్విట్టర్ లో తన ఖాతాను డిలీట్ చేస్తానని చెప్పి సంచలనంగా మారారు.
కారణం చెప్పకుండానే ఇలాంటి వ్యాఖ్యలు చేసే ఆయన.. ట్విట్టర్ ను మాత్రం విడిచి పెట్టరు. తనకు కోపం వచ్చినప్పుడో.. చిరాకు వేసినప్పుడో ట్విట్టర్ మీద కాస్త పంచ్ లు వేస్తుంటారు. తర్వాత అంతా మామూలే. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన్ను ఒక వినియోగదారుడు ఫేస్ బుక్ గురించి ప్రస్తావించారు. దీనికి బదులుగా ఎలాన్ జవాబు ఇస్తూ.. తాను ఫేస్ బుక్ పేరు విని చాలా ఏళ్లు అయ్యిందన్నారు. ఒక వ్యాపార దిగ్గజం నోటి నుంచి ఫేస్ బుక్ మీద ఇలాంటి వ్యాఖ్యలు రావటం ఆ సంస్థకు ఇబ్బందికరంగా మారిందంటున్నారు.