హైదరాబాద్ ను ముంచిన ‘క్యుములోనింబస్’ మేఘాలు అంటే ఏమిటి?

Update: 2020-10-19 17:41 GMT
వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాడు సీఎంగా ఉన్నప్పుడు నల్లమల మీదుగా వాతావరణం బాగా లేనప్పుడు ప్రయాణించి క్యూములోనింబస్ దట్టమైన మేఘాల ధాటికి హెలిక్యాప్టర్ ప్రమాదంలో మరణించారని నాడు విచారణలో తేలింది. ఇప్పుడు హైదరాబాద్ ను ముంచిన వానలు కూడా క్యూములో నింబస్ మేఘాలని తాజాగా మంత్రి కేటీఆర్ తెలిపారు. అసలు ఇంతటి భారీ వర్షాలు కురిపించే క్యూములోనింబస్ మేఘాలంటే ఏంటి? ఇవి ఎందుకు సాధారణ వర్షాన్ని కురిపిస్తాయి.? ఎందుకు ఇవంతా పవర్ ఫుల్ అనేది ఆసక్తిగా మారింది.

క్యుములోనింబస్ మేఘాలు నల్లగా.. దట్టంగా ఎక్కువ విస్తీర్ణంలో ఉంటాయి. ఇవి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలను కురిపిస్తాయి. కుంభవృష్టిని కురిపిస్తాయన్న మాట..

20 వేల అడుగుల ఎత్తులో ఆకాశంలో ఇవి ఏర్పడుతాయి. ఈ మేఘాల కింది భాగంగా నీరు, పైభాగంలో మంచు ఉంటుంది. గాలిలో తేమ ఎక్కువగా చేరడం.. వాతావరణలో అస్థిరత, వేడి పెరగడం వల్ల టవర్ ఆకారంలో ఇవి ఏర్పడుతాయి.

క్యూములోనింబర్ మేఘాలు అరగంట నుంచి మూడు గంటల వరకు భీకర వర్షాన్ని కురిపిస్తాయి. అందుకే ఈ మేఘాలు ఏర్పడినప్పుడు ప్రయాణం చేయడం చాలా ప్రమాదమని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఈ మేఘాలు ఎక్కువగా భూమధ్య రేఖా ప్రాంతంలోని ‘ఇండినేషియా, మలేషియా, సింగపూర్’ లాంటి ప్రాంతాల్లో ఏర్పడుతాయని నిపుణులు చెబుతున్నారు.
Tags:    

Similar News