పుల్లటి పెరుగు తినండి .. రక్తపోటును తగ్గించుకోండి !
పాలు పాల పదార్థాలతో తయారయ్యే ఆహార పదార్థాలను మనం రోజూ తీసుకోవడం ద్వారా రక్తపోటును దూరం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆహారంలో పెరుగు తీసుకోవడం ద్వారా అధిక రక్తపోటును దూరం చేసుకోవచ్చు. వారానికి ఐదారు కప్పుల పెరుగు తీసుకునేవారిలో హై బీపీ వచ్చే ప్రమాదం 20 శాతం తక్కువగా ఉంటుందని ఇటీవల నిర్వహించిన ఓ పరిశోధనలో వెల్లడైంది.
పెరుగులో ప్రోటీన్స్, ఎస్సెన్షియల్ విటమిన్లు, ఖనిజాలు మనలో శక్తిని పెంపొందింపజేస్తాయి. జీర్ణ వ్యవస్థ మందకొడిగా ఉండే వాళ్ళకు పెరుగు అమృతం వంటిది. ముఖంగా పిల్లలు, వయసు మళ్లిన వారిలో పెరుగు వారి జీర్ణ శక్తిని అనుసరించి పనిచేస్తుంది.
వేసవి కాలంలో పెరుగుతో చేసిన మజ్జిగ లేదా పెరుగులో చక్కెర కలుపుకుని లస్సీలాగా సేవిస్తే శరీరంలో వేడి తగ్గి ఉపశమనం కలుగుతుంది. ఎండల్లో తిరిగేవారు లస్సీని సేవిస్తుంటే ఆరోగ్యంగా ఉంటారంటున్నారు వైద్య నిపుణులు. పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా పుష్కలంగా ఉన్న పదార్థాలను 'ప్రోబయాటిక్' ఉత్పాదనలుగా మార్కెట్‌లో అమ్ముతున్న విషయమూ మనకు కొత్త కాదు. ప్రోబయాటిక్స్ ఉన్న ఆహారాలు అధిక రక్తపోటును తగ్గిస్తాయన్న విషయాన్ని ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు కొద్దికాలం కిందట ఒక అధ్యయనంలో తెలుసుకున్నారు.
ఈ సంగతి ఆస్ట్రేలియా నుంచి వెలువడే హెల్త్ జర్నల్ 'హైపర్ టెన్షన్' లోనూ ప్రచురితమైంది. ఒకవేళ మీకు హైబీపీ లేకపోయినా పరవాలేదు. పెరుగూ, ఒకింత పులిసిన అట్ల వంటి టిఫిన్లు పుష్కలంగా తీసుకుంటూ ఉంటే ఇందులోని ప్రోబయాటిక్ బ్యాక్టీరియా రక్తపోటును చాలావరకు నివారిస్తుంది. అల్సర్ తో బాధపడేవారు పెరుగు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.
నోట్లో పొక్కులు ఏర్పడి నోరుపుండైతే పెరుగును నోట్లో పోసుకుని పుక్కిలిస్తుంటే ఉపశమనం కలుగుతుంది. వేసవిలో ఎండ వేడికి చర్మం పాడవకుండా చేయడంలో పెరుగు భేష్‌గా పని చేస్తుంది. చర్మానికి సరఫరా అయ్యే నరాలకి శక్తినిస్తుంది. పెరుగులో ఉండే బాక్టీరియా చర్మ పోషణకు ఉపయోగపడుతుంది. పెరుగులో నిమ్మరసాన్ని కలిపి ముఖానికి పై పూతగా పూస్తే చర్మం పై ఉండే మలినాలు త్వరగా కరిగిపోతాయి.