డ్రంకెన్ డ్రైవ్ చేసేవాళ్లు.. పదేళ్లు జైలుకే..! సీపీ సజ్జనార్ హెచ్చరిక
మద్యం సేవించి వాహనాలు నడిపితే ఉపక్షించేది లేదని సైబరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ఇక నుంచి సైబరాబాద్ పరిధిలో తరచూ డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తామని హెచ్చరించారు. పట్టుబడ్డ వాళ్లపై 304 సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తామని చెప్పారు. పదేళ్లు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మందు తాగి డ్రైవింగ్ చేసేవాళ్లు టెర్రరిస్టులతో సమానమని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఒక్కరోజే సైబరాబాద్ పరిధిలో 402 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని హెచ్చరించారు. హైదరాబాద్‌లో ఇప్పటికే న్యూ ఇయర్ వేడుకలు నిషేధించామని గుర్తుచేశారు.
కొత్త స్ట్రెయిన్ ముప్పు పొంచి ఉన్నందున ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పబ్బులు, క్లబ్బలు, బార్లలోనే కాకుండా ఎక్కగా న్యూఇయర్ పార్టీలు చేసుకోవద్దని చెప్పారు. అపార్ట్మెంట్లు, కమ్యూనిటీ హాళ్లు, ఖాళీప్రదేశాల్లో కూడా జనాలు గుంపుగా చేరొద్దని న్యూఇయర్ వేడుకలు చేసుకోవద్దని హెచ్చరించారు. కొత్త స్ట్రెయిన్ విస్తరిస్తున్నందున ప్రజలంతా స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
మరోవైపు హైదరాబాద్‌లో కొత్త స్ట్రెయిన్ విస్తరిస్తున్నది. ఇప్పటికే రెండు కొత్త స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్రవైద్యశాఖ కేంద్ర ఆరోగ్యశాఖకు తెలిపింది. బ్రిటన్ నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా సోకింది. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, పూణేల్లోను కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం ఆరు కొత్త రకం కరోనా కేసులను గుర్తించినట్టు సమాచారం.