ఆహారం ద్వారా కరోనా వ్యాపించదట .. ఎవరు చెప్పారంటే ?

Update: 2020-07-27 11:50 GMT
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ఇప్పటికే దేశంలో కరోనా కేసుల సంఖ్య 14 లక్షలకి దాటిపోయింది. అలాగే 6. 5 లక్షల మంది కరోనా భారిన పడి మరణించారు. రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అలాగే ఇంకా దీనికి సరైన వ్యాక్సిన్ కనిపెట్టలేకపోతున్నారు. చాలా దేశాల్లో వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ జరుగుతున్నాయి. అది సక్సెస్ అయితే , ఈ కరోనా నుండి మానవ జాతికి విముక్తి దొరికినట్లే.

ఓ వైపు కరోనా మహమ్మారి కేసులు ఇలా భారీగా పెరుగుతున్నాయి. అలాగే మ‌రోవైపు క‌రోనా వ్యాప్తి విష‌యంలో ఇంకా అనేక సందేహాలు అలాగే మిగిలిపోతూ ఉన్నాయి.  అసలు ఈ కరోనా ఏ ఏ మార్గాల్లో వ్యాపిస్తోంది అనే దానిపై ఓ క్లారిటీకి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో   బెంగ‌ళూరు మ‌ణిపాల్ హాస్పిట‌ల్ డాక్టర్ గిరిధ‌ర్ బాబు ఒక ఆస‌క్తి కరమైన విష‌యాన్ని వెల్లడించారు. ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ వ్యాప్తి తీరును గ‌మ‌నిస్తే.. ఈ కొన్ని ర‌కాలుగా ఆ వైర‌స్ స్ప్రెడ్ అవుతోంద‌నేందుకు ఆధారాలు లేవ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఉప‌రితలం ద్వారా, ప్లాస్లిక్, ఎన్వ‌ల‌ప్స్, పేప‌ర్ ల ద్వారా క‌రోనా వ్యాప్తి జ‌రుగుతోంద‌నేందుకు క‌చ్చిత‌మైన ఆధారాలు లేవ‌ని తెలిపారు.

ఈ విదంగా క‌రోనా వ్యాప్తి చెందుతూ ఉంటే ..ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య చాలా వేగంగా పెరిగేద‌ని చెప్పారు. లాక్ డౌన్ సడలింపుల తరువాత చాలామంది అనేక యాప్స్ ద్వారా టేక్ అవే, హోం డెలివ‌రీ ఫుడ్ తింటున్నార‌ని, అలాగే పార్సిల్స్ డెలివ‌రీ కూడా ఎక్కువ‌గానే ఉంద‌నే విష‌యాన్ని ఆ  డాక్టర్ తెలిపారు.అలాగే   70 డిగ్రీల సెంటీగ్రేడ్ కు మించి వేడి చేసే ఫుడ్ లో వైర‌స్ ఉన్నా ఆ వేడికి న‌శించి పోతుంద‌ని అన్నారు. కేక్స్, ఇత‌ర ఫుడ్ ఐట‌మ్స్ ద్వారా క‌రోనా వ్యాపించ‌ద‌నే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. మాట్లాడేట‌ప్పుడు ప‌డే తుంప‌ర్లు, ఇత‌ర క‌రోనా సింప్ట‌మ్స్ ద్వారానే ఎక్కువ‌గా వైర‌స్ వ్యాప్తి జ‌రుగుతోంద‌ని అంచనా వేస్తున్నట్టు తెలిపాడు.
Tags:    

Similar News