మీరు డెబిట్.. క్రెడిట్ కార్డులు వాడతారా? అయితే ఇది చదవాల్సిందే

Update: 2020-09-30 17:30 GMT
ఇవాల్టి రోజున డెబిట్ కార్డు లేదంటే క్రెడిట్ కార్డు వాడటం మామూలైంది. నగదు చెల్లింపుల్ని వీలైనంత తక్కువగా చేస్తూ.. అవకాశం ఉన్న ప్రతిచోట ఆన్ లైన్ చెల్లింపులు చేయటమో.. కార్డుల్ని వినియోగించటం ఎక్కువైంది. దీన్ని అసరాగా చేసుకొని.. డెబిట్.. క్రెడిట్ కార్డుల్ని సైబర్ నేరాలకు పాల్పడే వారు ఎక్కువ అయ్యారు. ప్రజల్లో అవగాహన తక్కువగా ఉండటం.. దాన్ని వినియోగించే తీరు విషయంలో తెలియని విషయాల్ని అసరాగా చేసుకొని మోసపుచ్చుతున్నారు. దీంతో కార్డుదారులు నష్టపోతున్నారు.

పెరుగుతున్న సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు.. కార్డు చెల్లింపుదారులకు మరింత సురక్షింగా ఉంచేందుకు వీలుగా సరికొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసింది భారత రిజర్వు బ్యాంకు. డెబిట్.. క్రెడిట్ కార్డుల్ని క్లోనింగ్ చేసి బ్యాంకు ఖాతాల నుంచి సొమ్ము దోచేసే ఘటనలకు చెక్ చెప్పేందుక వీలుగా సరికొత్త ఆంక్షల్ని విధిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా వెల్లడించిన మార్గదర్శకాలు అక్టోబరు ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి.

కొత్త మార్గదర్శకాలను అనుసరించి చూస్తే.. కార్డుదారుడు తనంతట తాను కోరుకుంటే తప్పించి అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీల్ని కార్డులతో చేయటానికి వీలుండదు. డెబిట్.. క్రెడిట్ కార్డుల్ని ఏటీఎం.. పాయింట్ ఆఫ్ సేల్ వద్ద మాత్రమే లావాదేవీలు చేసుకునే అవకాశం కల్పిస్తారు. అదే సమయంలో భారత్ లోని కానీ.. విదేశాల్లో కానీ ఆన్ లైన్.. కాంటాక్టు లెస్ కార్యకలాపాలకు కార్డుల్ని వినియోగించే అవకాశం లేని రీతిలో ఉంచనున్నారు. తాజా నిర్ణయంతో ఆన్ లైన్ మోసాలకు చెక్ పెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Tags:    

Similar News