కరోనా పై పోరులో ఈ 'జైన్' కమ్యూనిటీ ఆదర్శం
కరోనా మహమ్మారి ఇప్పుడు కోరలు చాస్తోంది. దేశంలో రాష్ట్రంలో వేల కేసులు నమోదవుతున్నాయి. ఏపీలో అయితే రోజుకు 10వేల కేసులు నమోదవుతున్నాయి. అయితే ఏపీ లోని రాజమండ్రి లో ‘జైన్’ కమ్యూనిటీ కరోనా పోరు లో ప్రభుత్వం పై ఆధార పడకుండా సొంతంగా తమకు తాము సౌకర్యాలు కల్పించుకొని ఆదర్శంగా నిలిచారు.
కరోనా వచ్చిందని భయపడి ప్రభుత్వ ఆసుపత్రులకు పోయే వారు కొందరు.. లక్షలు చెల్లించి ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ జేబులు ఖాళీ చేసుకునే వారు మరికొందరు. కానీ ఈ బంగారం, ఇతర వ్యాపారాలు చేసే రాజమండ్రి ‘జైన్’ కమ్యునిటీ వ్యాపారులు మాత్రం కరోనా సోకినా ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులపై ఆధార పడకుండా ఏకంగా ఓ కళ్యాణ మండపాన్ని బుక్ చేశారు. అందులో సకల సౌకర్యాలు కల్పించుకున్నారు.
బెడ్, దానిపక్కనే ఓ టేబుల్ ఫ్యాన్.. ఆడుకోవడానికి క్యారమ్ బోర్డ్, చెస్, షటిల్, క్రికెట్ పరికరాలు.. చూడడానికి టీవీ.. ఇలా సర్వం సమకూర్చుకొని కరోనా బారిన పడిన తమ కమ్యూనిటీ వాసులు కృంగి పోకుండా మంచి వైద్య సదుపాయాల తో తీర్చి దిద్దారు.
ఇలా డబ్బులున్న వారంతా ఎవరికి వారు సొంతంగా జాగ్రత్తలు తీసుకుంటే కరోనా కాదు కదా.. దాని తల్లిలాంటి వ్యాధి వచ్చినా ఏమీ చేయలేదని నిరూపించారు. కరోనాకు భయపడకుండా తమ వ్యాపారంలో ఎక్కువగా ఆ బారిన పడే వారి కోసం జైన్ కమ్యూనిటీ చేసుకున్న సౌకర్యాల వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. అందరూ ఇలా ఎవరికి వారు సౌకర్యాలు సమకూర్చుకుంటే ఇక ఏ వ్యాధి మనల్ని ఏమీ చేయలేదు.
Full View