అచ్చెన్నాయుడి సైలెన్స్.. వ్యూహమా? భయమా?

Update: 2020-10-09 17:30 GMT
అచ్చెన్నాయుడు అంటేనే ఒక ఫైర్ బ్రాండ్. అసెంబ్లీలో ఉంటే చెలరేగిపోయేవాడు. గత టీడీపీ ప్రభుత్వంలో జగన్ ను , వైసీపీ నేతలను చెడుగుడు ఆడుతూ పరుష విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచాడు. అలాంటి అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కాంలో ఇరుక్కొని 2 నెలలు జైలు శిక్ష అనుభవించి బెయిల్ పై బయటకొచ్చాక మౌనం దాల్చారు. మీడియాకు కనిపించడం లేదు. ప్రజలతో మాట్లాడడం లేదు. అసలు ఏ కార్యక్రమానికి రాకుండా గప్ చుప్ గా ఇంట్లోనే ఉంటున్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అవుతాడని వార్తలు వచ్చినా ఆయన మౌనం వీడలేదు. ఆ పోస్టు కన్ఫం కాలేదు.

అసెంబ్లీలో ఇంటా బయటా వైసీపీని టార్గెట్ చేసిన అచ్చెన్న ఇప్పుడు ఈఎస్ఐ స్కాంలో ఇరుక్కుపోయి జైలుపాలయ్యాడు. బెయిల్ పై విడుదలయ్యాక జగన్ పై విరుచుకుపడుతారని అంతా భావించగా.. అరెస్ట్, కేసులో మౌనం దాల్చారు. దీంతో టీడీపీ నేతలంతా షాక్ అయ్యారు.

బెయిల్ పై విడుదలైన నెల కావస్తున్నా అచ్చన్న వివరణ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. 40 రోజులుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకపోవడంతో ఆయన వైసీపీ సర్కార్ భయపడుతున్నాడని.. అందుకే సైలెంట్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. అయితే ఆ మౌనం వ్యూహమేనని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అయ్యాక జూలు విధిస్తారని అంటున్నారు.

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ప్రకటన తర్వాత అచ్చెన్న బయటకు వస్తారని మునుపటిలా రాజకీయాల్లో జోరు పెంచుతారని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. చంద్రబాబు పరామర్శ సందర్భంగా అచ్చెన్న ట్వీట్ చేసి అక్రమ కేసులకు భయపడేది లేదని అనడాన్ని టీడీపీ నేతలు ఎత్తిచూపుతున్నారు.
Tags:    

Similar News