• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ముక్కంటి దర్శనం వేళ...

ముక్కంటి దర్శనం వేళ మంత్రి రోజా తప్పు చేశారా?

By - Tupaki Desk
Update: 2022-08-25 05:31 GMT
గతానికి వర్తమానానికి పరిస్థితుల్లో చాలానే మార్పులు వచ్చాయి. ప్రైవేటుగా జరిగే వాటిని పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే.. ఆయా అంశాలు బయటకు రాకపోవటమే కారణం. కానీ.. పబ్లిక్ గా జరిగే అంశాలు అందరి నోట నానటమే కాదు.. తప్పులకు తెర తీసిన వైనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా ఏపీ మంత్రి ఆర్కే రోజా ఇలాంటి తీరునే ప్రదర్శించి.. కొత్త వివాదానికి తెర తీశారు. దక్షిణ కాశీ క్షేత్రంగా పేరున్న శ్రీకాళహస్తిలో అమలు చేసే నిబంధనల్ని పక్కన పెట్టేసి.. మంత్రి రోజా తనకుతోచినట్లుగా పని చేశారన్న ఆరోపణ అంతకంతకూ ఎక్కువ అవుతోంది.

సామాన్య భక్తుల విషయంలో ఒకలా వ్యవహరించే ఆలయ సిబ్బంది.. ప్రముఖులు.. వీవీఐపీలు విషయంలో మాత్రం రోజురోజుకీ చేస్తున్న తప్పుడు పనులు విమర్శలకు తావిచ్చేలా చేసిందని చెప్పాలి. దక్షిణ కాశీగా పేరున్న శ్రీకాళహస్తి  స్వామి ఆలయంలో ఉన్న నిబంధనల్ని ఏపీ మంత్రి రోజా పక్కకు పెట్టేయటం హాట్ టాపిక్ గా మారింది. భూతనాథుడి ఆలయంలో ఆలయ అర్చకులు.. వెలిగించే దీపాలు మినహా.. భక్తులు వెంట తెచ్చుకునేందుకు వేటిని అనుమతించరు.

కానీ.. ఏపీ మంత్రి ఆర్కే రోజా మాత్రం నిబంధనల్ని.. ఆచారాల్ని పక్కన పెట్టేసి తాను అనుకున్నదే ఆమె చేశారన్న విమర్శ వినిపిస్తోంది. రాహుకేతు సర్పదోష నివారణార్థం శ్రీకాళహస్తి ఆలయానికి వచ్చిన ఆమె.. ముక్కంటి దర్శనానికి ముందుగా సహస్రలింగేశ్వర సన్నిధి వద్ద రాహు కేతు దోష నివారణ పూజ నిర్వహించారు.

దోష నివారణ పూజ తర్వాత స్వామి., అమ్మవార్లకు నిర్వహించే రుద్రాభిషేక పూజలో పాల్గొన్నారు. అనంతరం స్వామి అమ్మవార్లకు నిర్వహించే దీపారాధన పూజలో పాల్గొన్నారు.

ఇంతకూ ఆర్కే రోజా చేసిన తప్పు ఏమంటే.. నేతి దీపాలు.. ఆమె వెంట తెచ్చుకున్న వైనం ఒక ఎత్తు అయితే.. నిబంధనలకు విరుద్ధంగా నేతి దీపాలు ఆమె తన వెంట తెచ్చుకున్నారు. అంతేకాదు.. నిమ్మకాయ, ప్రతిమలు, టెంకాయ, పిండి మిశ్రమం, గుమ్మడి కాయ వంటి వాటిలో నేతి దీపాలు వెలిగించడం నిషేధం. కానీ.. మంత్రి రోజా మాత్రం ఇవేమీ పట్టించుకోలేదు. ఆలయానికి వెళ్లటం ఏమో కానీ.. ఇప్పుడు తెర మీదకు వచ్చిన అంశం కావాలని చేసింది కాదన్న మాట వినిపిస్తోంది.
Tags:    
  • AndhraPradesh 
  • Minister 
  • RkRoja 
  • TTD 
  • Mukkotidarshanam 
  • SriKalahasthi 
  • Pooja 
  • PoliticalNews 

Similar News

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS