• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రాజీనామా అంటున్న వైసీపీ...

రాజీనామా అంటున్న వైసీపీ మంత్రి...కోరి తెచ్చుకున్న పదవి వద్దా...?

By - Tupaki Desk
Update: 2022-10-21 14:30 GMT
ఆయన ఉత్తరాంధ్రాలోని సీనియర్ నేతలలో ఒకరు. అనేకసార్లు ఎమ్మెల్యేగా గెలిచి పలుమార్లు మంత్రిగా పనిచేసిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన పెద్దాయన. ఆయనే ధర్మాన ప్రసాదరావు. ఆయనకు ఆరు నెలల క్రితం జగన్ విస్తరణలో మంత్రి పదవి ఇచ్చారు. ఇక శాఖాపరంగా కీలకమైన రెవిన్యూ శాఖను అప్పగించారు. దాంతో ప్రసాదరావు ఆశలు నెరవేరాయని ఇక ఖుషీ అని అంతా అనుకున్నారు. కానీ మంత్రి అయి తన సొంత జిల్లాకు వచ్చి అభినందన సభలో పాల్గొన్న ప్రసాదరావు ఆ రోజే తన పొలిటికల్  రిటైర్మెంట్ గురించి చెప్పి షాక్ తినిపించారు. వర్తమాన రాజకీయాల్లో కొనసాగడం కష్టం అన్నట్లుగా పేర్కొన్నారు. పైగా ఎపుడూ మేమేనా అంటూ కూడా చెప్పుకొచ్చారు.

ఆ తరువాత కూడా ఆయన అనేక సందర్భాలలో మంత్రి పదవి దక్కిందన్న ఆనందం కంటే కూడా రెవిన్యూ శాఖలో అవినీతి అంటూ సంచలన కామెంట్స్ వంటివి  చేసి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ఇక ఈ మధ్యనే రాజుకున్న మూడు రాజధానుల వ్యవహారం మీద ఆయన మాట్లాడుతూ అవసరం అయితే తాను మంత్రి పదవికి రాజీనామా చేసి పోరాడుతాను అని బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు.

దాని మీద విపక్షాలు సైతం ఘాటుగానే రియాక్ట్ అయ్యాయి. వైసీపీ మంత్రుల  రాజీనామాలు డ్రామా అని కూడా దుయ్యబెట్టాయి. ఇదిలా ఉంటే విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించి షాక్ ఇచ్చారు. ఆయన రాజీనామా వ్యవహారం ఇప్పటికైతే  ఏమీ తేలలేదు కానీ ఇపుడు ధర్మాన మరోసారి తన రాజీనామా అంశాన్ని ఏకంగా ముఖ్యమంత్రి జగన్ వద్దనే కదిపారు అని అంటున్నారు.

తాజాగా ఆయన ముఖ్యమంత్రిని కలసినపుడు తాను రాజీనామా చేస్తాను అని చెప్పారట. అనుమతిస్తే మూడు రాజధానుల విషయంలో తాను ముందుండి పోరాడుతానని ధర్మాన వెల్లడించారుట. అంతా విన్న ముఖ్యమంత్రి జగన్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని మంత్రితో అన్నట్లుగా సమాచారం. అదే విధంగా మూడు ప్రాంతాల అభివృద్ధిని కోరుతూ తాము మూడు రాజధానులను ప్రతిపాదించామని, రాజీనామాలు చేయడం అనవసరమని వారించారని భోగట్టా.

ఈ విషయంలో ప్రభుత్వం తాను అనుకున్న లక్ష్యం దిశగా సాగుతోంది అని కూడా అన్నారని తెలుస్తోంది. అయితే ధర్మనా కోరి మరీ తెచ్చుకున్న మంత్రి పదవి విషయంలో ఎందుకు వద్దు అనుకుంటున్నారు అన్నదే ఇపుడు చర్చగా ఉంది. అదే సమయంలో ఆయన 2019 ఎన్నికల వేళనే కాబోయే మంత్రికి మీ ఓటు అని తన అనుచరులతో ఎన్నికల ప్రచారం చేయించుకుని గెలిచారు.

అంటే వైసీపీ సర్కార్ అధికారంలోకి వస్తే డ్యాం ష్యూర్ గా తనకు మంత్రి పదవి దక్కుతుందని నాడు ధర్మాన భావించారు అని అంటారు. అయితే ఆయనకు తొలి విడతలో పదవి రాకపోవడం పట్ల తీవ్ర మనస్తాపం చెందారని అంటారు. ఆ విధంగా ఆయన ఒక ఎమ్మెల్యేగా అప్పట్లో ప్రభుత్వం మీద విసుర్లు విసురుతూ కొంత సంచలనం రేకెత్తించారు. చివరికి కోరుకున్నట్లుగా  మంత్రి అయ్యారు. మరి ఆయన ఈ పదవిలో ఆనందంగా ఉండలేకపోతున్నారా అన్నదే ఇపుడు చర్చగా ఉంది. ఏది ఏమైనా ధర్మాన రాజీనామా విషయంలో ఎందుకో సీరియస్ గానే ఆలోచిస్తున్నారు అన్నది సీఎం జగన్ తో మాట్లాడడం ద్వారా బయటపెట్టుకున్నారు. చూడాలి మరి ఆయన ఏ విధంగా ముందుకు అడుగులు వేస్తారో.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • YSRCPGovernment 
  • APPolitics 
  • DharmanaPrasadaRaoResignation 
  • YSJaganMohanReddy 
  • YSRCPMinister 
  • DharmanaPrasadResignation 

Similar News

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

Copyright @2026

Powered by Blink CMS