• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ప్రపంచాన్ని చూటేస్తున్న...

ప్రపంచాన్ని చూటేస్తున్న బ్రిటన్ కొత్త వైరస్ స్ట్రెయిన్ ... తెలుగు రాష్ట్రాల్లోను కలకలం , క్యారియర్స్

By - Tupaki Desk
Update: 2020-12-24 08:32 GMT
కరోనా వైరస్ నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం అనుకుంటున్న సమయంలో బ్రిటన్ లో కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ వెలుగులోకి రావడం తో అందరిలో ఆందోళన పెరిగిపోతుంది. బ్రిటన్ లో ఈ కొత్త వైరస్ విజృంభణ మొదలైంది అని తెలియగానే ఐర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఇటలీ, డెన్మార్క్, ఆస్ట్రియా, పోర్చుగల్, స్వీడన్‌ , భారత్ లు  ఇప్పటికే బ్రిటన్‌ నుంచి తమ దేశాలకు విమానాలు రాకుండా తాత్కాలిక నిషేధం ప్రకటించాయి.

అయితే , ఈ కొత్త వైరస్  స్ట్రెయిన్ క్రమంగా ఇతర దేశాలకు కూడా వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ కేసులు తమ దేశాల్లో బయటపడ్డాయని నార్తర్న్ ఐర్లాండ్, ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించాయి. లండన్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి ఇది సోకినట్టు గుర్తించామని ఐర్లండ్ ప్రకటించింది. అలాగే, ఇంగ్లాండ్ నుంచి తమ దేశంలో ప్రవేశించిన నలుగురికి ఈ స్ట్రెయిన్  లక్షణాలు కనిపించాయని ఇజ్రాయెల్ వెల్లడించింది. కరోనా వైరస్ క్వారంటైన్ గా కేంద్రంగా మార్చిన ఓ హోటల్ కి ముగ్గురిని తరలించామని, మరో కేసు వివరాలు తెలియాల్సి ఉందని ఇజ్రాయెల్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

అయితే ఈ కొత్త మహమ్మారి తలెత్తిన తరుణంలో మోడెర్నా సంస్థ విశిష్టమైన ప్రకటన చేసింది. నూతన వైరస్ స్ట్రెయిన్ నుంచి రక్షించి, రోగ నిరోధక శక్తిని పెంపొందించేట్టు తమ వ్యాక్సిన్ ప్రొటెక్షన్ ఇవ్వగలదని ప్రకటించింది. పైగా ఇందుకు అనుగుణంగా మరిన్ని టెస్టులు కూడా నిర్వహిస్తున్నట్టు తెలిపింది. అటు-ఫైజర్, ఆస్ట్రాజెనికా కంపెనీలు కూడా తమ టీకామందులు కొత్త వైరస్ ను నీరు గార్చవచ్చునని భావిస్తున్నాయి. ఇక బ్రిటిష్ హెల్త్ ఏజెన్సీ..తమ రాపిడ్ కోవిడ్ 19 టెస్టులు నూతన వైరస్ ను గుర్తించగలవని , ఇవి జయప్రదంగా కొనసాగుతున్నాయని తెలిపింది.

బ్రిటన్ లో వెలుగులోకి వచ్చిన స్ట్రెయిన్ వైరస్ తాజాగా కరీంనగర్ ‌లో కలకలం రేపుతోంది. గడిచిన కొన్ని రోజులుగా బ్రిటన్ నుంచి జిల్లాకు 16 మంది వచ్చారని సమాచారం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన చర్యలు చేపట్టారు. ఇప్పటికే పది మంది శాంపిల్స్ తీసుకున్న జిల్లా వైద్యాధికారులు నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌ కు తరలించారు. ఇదిలా ఉంటే మరో ఆరుగురి కోసం అధికారులు వేట ప్రారంభించారు.

 అలాగే , యూకె నుండి  రాజమండ్రికి వచ్చిన ఓ మహిళకు కరోనా సోకింది.  యూకే నుంచి ఢిల్లీ వచ్చిన ఆ మహిళకు కరోనా టెస్టులు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది.  అయితే, ఆమెను ఢిల్లీలోని క్వారంటైన్ లో ఉంచగా, అక్కడి నుంచి మహిళ తప్పించుకొని ఏపీ ఎక్స్ ప్రెస్ లో రాజమండ్రికి వచ్చింది.  రాజమండ్రికి వచ్చిన మహిళను అధికారులు పట్టుకొని ఆసుపత్రికి తరలించారు.  ఆమెతో పాటుగా ఆమె కొడుకును కూడా ఆసుపత్రికి తరలించారు.  మహిళకు సోకింది కొత్త కరోనా కాదా అని తేల్చేందుకు రక్తనమూనాలను సేకరించారు.  పూణే లోని వైరాలజి ల్యాబ్ కు పంపించి మహిళకు సోకింది కొత్త కరోనా కాదా అని తేల్చబోతున్నారు. మొత్తంగా బ్రిటన్ వైరస్ ప్రభావం దేశంలో ఎక్కువ ప్రభావం చూపకుండా త్వరగా ఈ కొత్త వైరస్ క్యారియర్స్ ను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమైయ్యారు.
Tags:    
  • Oil giant BP 
  • 10 
  • 000 jobs on Dangerous Disease 
  • Dangerous Disease In United Kingdom 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

సీనియర్లను రంగంలోకి దించిన జనసేన

2026-11-19 21:15 GMT

ఎవరు గెలిచినా మేమే...వైసీపీ అలా తృప్తి పడుతోందా ?

2026-11-19 21:12 GMT

మంత్ర్రుల‌ను కాద‌న‌లేరు.. కార్య‌క‌ర్త‌ల‌ను వ‌ద్ద‌న‌లేరు: బాబుకు చిక్కులు

2026-11-19 21:12 GMT

పెరిగే సీట్లు వైసీపీ రాజకీయాన్ని ముంచేస్తాయా ?

2026-11-19 21:11 GMT

మలేషియా గేట్లు మూసేసింది.. భారతీయులకు ఇక వీసా కష్టాలు.. అసలు కారణమిదే..

2026-11-19 21:10 GMT

కొలువు తీరిన ఎంపీపీలు...రికార్డు స్థాయిలో పదవులు

2026-11-19 21:01 GMT

మోదీ ప్రస్తావించిన లైసెన్స్ రాజ్ అంటే ఏమిటి? ఏంటా కథ?

2026-11-19 21:00 GMT

'రాష్ట్ర పండుగ' గా రామోజీరావు జయంతి.. ..ప్రభుత్వ నిర్ణయంపై భిన్న వాదనలు ఇవే !

2026-11-19 20:57 GMT

మూడు ముళ్ల బంధం.. రూ. 7.50 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

2026-11-19 19:30 GMT

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS