• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కరోనా కొమ్ములు పదును...

కరోనా కొమ్ములు పదును చేసిన ‘పొజిషన్‌ 69/70, 144/145’

By - Tupaki Desk
Update: 2020-12-23 05:30 GMT
దగ్గర దగ్గర ఏడాది నుంచి కోవిడ్19కు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుంటున్న ప్రజలకు.. ఈ వైరస్ కు సంబంధించిన చాలా విషయాలు అవగాహనకు వచ్చేశాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు కొత్త కలకలంగా మారిన బ్రిటన్ వైరస్ వణుకు తెప్పిస్తోంది. వైరస్ ఏదైనా కానీ.. మనిషి శరీరంలోకి వెళ్లి.. తిష్ట వేసుకున్న తర్వాత అది అంతో ఇంతో తనను తాను మార్పులు చేసుకుంటుంది. అదేమీ కొత్త విషయం కాదు. ఆ మాటకు వస్తే కోవిడ్ 19 ఇప్పటికి పలుమార్పులు చేసుకుంది.

అయితే.. ఇప్పటివరకు చోటు చేసుకున్న మార్పులు ఏవీ అంతగా ఇబ్బంది పెట్టింది లేదు. కానీ బ్రిటన్ లో గుర్తించిన ‘ఏ2బీ’తోనే అసలు చిక్కంతా. రెగ్యులర్ వైరస్ కంటే 70 శాతం అత్యధిక వేగంతో విస్తరిస్తున్న ఈ వైరస్ ను తొలిసారి అక్టోబరులోనే గుర్తించారు. అయితే.. దాన్ని అంత సీరియస్ గా తీసుకోలేదు. సహజంగానే వైరస్ జన్యువుల్లో జరిగే  మార్పుల్లో భాగంగానే గుర్తించారు. అయితే.. ఈ వైరస్ బ్రిటన్ లోని ఒక భాగంలో విపరీతంగా విస్తరించటంతో పరిశోధకులు దీని మీద మరింత ఫోకస్ పెంచారు.

మారిన ‘ఏ2బీ’ వైరస్ జన్యువుల్ని మరింత లోతుగా విశ్లేషించే ప్రయత్నం చేసినప్పుడు కొత్త విషయాలు బయటకు వచ్చింది. బ్రిటన్ వైరస్ లో మొత్తం 23 రకాల జన్యు మార్పులు చోటు చేసుకున్నట్లుగా గుర్తించారు. అన్నింటికి మించి జన్యు క్రమంలో రెండు చోట్ల తొలగింపులు ఉండటం వేగంగా వైరస్ వ్యాప్తికి కారణంగా భావిస్తున్నారు. ఆ తొలగింపులే ‘‘పొజిషన్‌ 69/70, 144/145’’గా గుర్తించారు. దీని పుణ్యమా అనే.. కొత్త తరహా వైరస్ వేగంగా విస్తరించటానికి... కోవిడ్ కొమ్ములు మరింత పదును చేసేలా చేసిందంటున్నారు.

కోవిడ్ కు ఉండే కొమ్ముల్లోనే అధిక జన్యు మార్పులు చోటు చేసుకోవటం.. వైరస్ నకళ్లు ఏర్పడే వేగం ఎక్కువగా ఉంటుందని బ్రిటన్ కు చెందిన నిపుణులు టీం సభ్యుడు వెండీ బార్క్ లే చెబుతున్నారు. ఈ పొజిషన్ ప్రపంచానికి సరికొత్త సవాలుగా మారిందని చెప్పక తప్పదు.
Tags:    
  • Oil giant BP 
  • 10 
  • 000 jobs on Dangerous Disease 
  • Dangerous Disease In United Kingdom 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

సీనియర్లను రంగంలోకి దించిన జనసేన

2026-11-19 21:15 GMT

ఎవరు గెలిచినా మేమే...వైసీపీ అలా తృప్తి పడుతోందా ?

2026-11-19 21:12 GMT

మంత్ర్రుల‌ను కాద‌న‌లేరు.. కార్య‌క‌ర్త‌ల‌ను వ‌ద్ద‌న‌లేరు: బాబుకు చిక్కులు

2026-11-19 21:12 GMT

పెరిగే సీట్లు వైసీపీ రాజకీయాన్ని ముంచేస్తాయా ?

2026-11-19 21:11 GMT

మలేషియా గేట్లు మూసేసింది.. భారతీయులకు ఇక వీసా కష్టాలు.. అసలు కారణమిదే..

2026-11-19 21:10 GMT

కొలువు తీరిన ఎంపీపీలు...రికార్డు స్థాయిలో పదవులు

2026-11-19 21:01 GMT

మోదీ ప్రస్తావించిన లైసెన్స్ రాజ్ అంటే ఏమిటి? ఏంటా కథ?

2026-11-19 21:00 GMT

'రాష్ట్ర పండుగ' గా రామోజీరావు జయంతి.. ..ప్రభుత్వ నిర్ణయంపై భిన్న వాదనలు ఇవే !

2026-11-19 20:57 GMT

మూడు ముళ్ల బంధం.. రూ. 7.50 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

2026-11-19 19:30 GMT

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS