విశ్వమంతా ఒకే వైరస్ ..ఒకే రూపం !

Update: 2020-07-13 08:30 GMT
భారతదేశం ప్రస్తుతం కరోనా కోరల్లో చిక్కి , అందులో నుండి ఎలా బయటపడాలో తెలియక కొట్టుమిట్టాడుతోంది. రోజురోజుకి ఈ మహమ్మారి మరింత వేగంగా విజృంబిస్తు డి సమ్మెలో పేరుకుపోతుంది. దేశంలో  విస్తరిస్తున్న కరోనా వైరస్‌ ప్రధానంగా రెండు రకాలు. ఒకటి బలహీనమైది, మరొకటి బలమైనది. దక్షిణాదిలో బలహీనమైన వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్నది. అయితే , ఇది ఒకప్పుడు అని , కానీ ఇప్పుడు  దేశం మొత్తం ఒకే రకమైన వైరస్ వ్యాప్తి చెందుతుంది అని సీసీఎంబీ తెలిపింది.  ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒకే రకమైన వైరస్‌ మనుగడ లో ఉన్నట్టు  సీసీఎంబీ గుర్తించింది.

ప్రస్తుతం భారత్‌ తో పాటు ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టిస్తున్న  వైరస్‌ ఒకే రకమైనదని తమ పరిశోధనలో తేలిందని సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌మిశ్రా తెలిపారు. అలాగే , వైరస్‌ ఆర్‌ ఎన్ ‌ఏ జన్యురూపంలో మార్పులు  లేవని స్పష్టంచేశారు. కరోనా జన్యుక్రమంలో మార్పుల గుట్టును విప్పడానికి  రాకేశ్‌మిశ్రా నేతృత్వంలో రెండునెలలుగా జీనోమ్‌ సీక్వెన్సీ పరిశోధనలు ముమ్మరంగా సాగాయి. మొదటిదశలో 100కుపైగా వైరస్‌ నమూనాల జన్యువులను వేరుచేసి లోతుగా పరిశీలించారు. ఈ పరిశోధనల్లో కరోనా జన్యువుల్లో తేడాలను స్పష్టంచేయగలిగారు. దేశంలో ప్రధానంగా రెండురకాలుగా ఉన్నట్టు గుర్తించారు.

తెలంగాణతోపాటు కేరళ, తమిళనాడు, ఏపీలో వ్యాపిస్తున్న వైరస్‌, మహారాష్ట్ర, గుజరాత్వం టి  రాష్ట్రాల్లో  విస్తరిస్తున్న వైరస్‌ కు స్పష్టమైన తేడా ఉన్నదని సీసీఎంబీ జీనోమ్‌ సీక్వెన్సీ పరీక్షల్లో స్పష్టమైంది. దక్షిణాదిలో మనుగడలో ఉన్న వైరస్‌కు ‘క్లేడ్‌ ఏ3ఐ’గా నామకరణంచేశారు. ఉత్తర, మధ్య భారతంలో విస్తరిస్తున్న వైరస్‌ కు ‘క్లేడ్‌ ఏ2ఏ’గా వ్యవహరిస్తున్నారు. ఈ రెండు వైరస్ ‌లలో తేడా స్పష్టంగా ఉన్నట్టు సీసీఎంబీ తుదిదశ జన్యుక్రమ పరీక్షల్లో తేలింది. కానీ తుదిదశలో మరో 100 నమూనాలను పరిశీలించిన సీసీఎంబీ బలహీన వైరస్ ‌గా భావిస్తున్న ‘క్లేడ్‌ ఏ3ఐ’ వేగంగా క్షీణించినట్టు గుర్తించింది.  అలాగే దేశంలో ఒకేరకమైన వైరస్ మనుగడలో ఉన్నట్టు స్పష్టం చేశారు. ప్రస్తుతం విశ్వవ్యాప్తంగా మనుగడ లో ఉన్న వైరస్‌ కు, దేశంలోని వైరస్ ‌కు తేడా కనిపించడంలేదు అని సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ తెలిపారు.
Tags:    

Similar News