కష్టం లేని పంట.. ఆ రెండింటితో రైతన్నకు కాసుల వర్షం!

తక్కువ పెట్టుబడితో, కేవలం గాలి, నీరు, ఎండ ఉంటే చాలు.. నెలకు లక్షల్లో ఆదాయం తెచ్చిపెట్టే ఈ వినూత్న సాగు ఇప్పుడు రైతులకు ఒక వరంలా మారింది. ఆ వివరాలు చూద్దాం..;

Update: 2026-03-05 12:30 GMT

ప్రకృతి మనకిచ్చిన అద్భుత వరం స్పిరులీనా. దీని గురించి ఎక్కువ మందికి తెలియదు. ఎకరాల భూమి, పురుగు మందుల అవసరం లేకుండా కేవలం ఇంటి పెరట్లోనే చిన్న తొట్టిలో దీనిని పెంచవచ్చు. అంతరిక్షంలో వ్యోమగాములు తీసుకునే ఆహారం కాబట్టి దీనిని 'స్పేస్ ఫుడ్' అని కూడా పిలుస్తారు. తక్కువ పెట్టుబడితో, కేవలం గాలి, నీరు, ఎండ ఉంటే చాలు.. నెలకు లక్షల్లో ఆదాయం తెచ్చిపెట్టే ఈ వినూత్న సాగు ఇప్పుడు రైతులకు ఒక వరంలా మారింది. ఆ వివరాలు చూద్దాం..

సూపర్‌ ఫుడ్ స్పిరులీనా:

స్పిరులీనా అనేది నీటిలో పెరిగే ఒక రకమైన నాచు (Algae). ఇందులో ఉండే ప్రోటీన్లు, విటమిన్లు మరే ఇతర ఆహారంలోనూ ఉండవు, అందుకే దీనిని 'సూపర్ ఫుడ్' అంటారు. కేవలం ఒక కేజీ స్పిరులీనా పొడి.. సుమారు వెయ్యి కేజీల కూరగాయలతో సమానమైన పోషకాలను ఇస్తుంది. ఇప్పుడు దీనికి మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఇక ఒక కేజీ పొడి నాణ్యతను బట్టి రూ. 600 నుండి రూ. 1200 వరకు పలుకుతోంది. ఫార్మా కంపెనీలు, హెల్త్ డ్రింక్స్ మరియు కాస్మెటిక్స్ తయారీలో దీనిని ఎక్కువగా వాడుతుండటంతో దీనికి తిరుగులేని మార్కెట్ ఏర్పడింది.

సాగు చేయడం చాలా ఈజీ.. 15 రోజుల్లోనే మొదటి దిగుబడి:

ఈ పంట సాగుకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక పెద్ద తొట్టిలో నీరు నింపి, అందులో 'మదర్ కల్చర్' వదిలితే చాలు. ఇక దీనికి పురుగు మందులు, ఎరువులు అస్సలు అక్కర్లేదు. కేవలం సూర్యరశ్మి తగిలేలా ఉంచి, రోజుకు రెండుసార్లు కర్రతో నీటిని కలియతిప్పితే గాలి తగిలి నాచు వేగంగా పెరుగుతుంది. కేవలం 10 నుండి 15 రోజుల్లోనే మొదటి దిగుబడి అందుకోవచ్చు. ఆ తర్వాత నాచును సన్నని గుడ్డతో వడకట్టి, ఎండలో ఆరబెట్టి పొడి చేస్తే చాలు.. మీ ఉత్పత్తులు అమ్మకానికి సిద్ధమైనట్లే.

పది ట్యాంకులతో లక్షల ఆదాయం.. ఇంటి నుంచే బిజినెస్:

మీ దగ్గర కేవలం 10 ట్యాంకులు పెట్టుకునే స్థలం ఉంటే చాలు,లేదంటే టెర్రస్ పైన అయినా సరే ఏర్పాటు చేయవచ్చు. ఇక నెలకు సుమారు 40 వేల నుండి 60 వేల రూపాయల వరకు సులభంగా సంపాదించవచ్చు. సరైన ప్రణాళికతో పది ట్యాంకులను మెయింటైన్ చేయగలిగితే లక్షల్లో ఆదాయం మీ సొంతమవుతుంది. ఇది కేవలం రైతులే కాదు, ఖాళీగా ఉండే గృహిణులు, విద్యార్థులు కూడా పార్ట్ టైమ్ బిజినెస్‌గా ప్రారంభించవచ్చు. పెట్టుబడి తక్కువ, రిస్క్ అసలే లేదు.. అందుకే నేటి కాలంలో ఇది ఒక స్మార్ట్ అగ్రికల్చర్ మోడల్‌గా నిలుస్తోంది. ప్రకృతి ఇచ్చిన ఈ చిన్న నాచు మొక్క రైతన్న పాలిట బంగారు గుడ్లు పెట్టే బాతులా మారింది. తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందాలనుకునే వారికి స్పిరులీనా సాగు ఒక అద్భుతమైన మార్గం అంటున్నారు నిపుణులు.

Tags:    

Similar News