ట్రెండింగ్ లో ఘోస్ట్ లైటింగ్.. డేటింగ్ ప్రపంచంలో కొత్త మోసం!

నేటి డిజిటల్ యుగంలో ప్రేమికుల మధ్య సంబంధాలు ఎంత వేగంగా మొదలవుతున్నాయో, అంతే విచిత్రంగా ముగుస్తున్నాయి.;

Update: 2026-03-05 12:14 GMT

నేటి డిజిటల్ యుగంలో ప్రేమికుల మధ్య సంబంధాలు ఎంత వేగంగా మొదలవుతున్నాయో, అంతే విచిత్రంగా ముగుస్తున్నాయి. నిన్నటి వరకు 'ఘోస్టింగ్' అంటే చెప్పకుండా మాయమైపోవడం గురించి విన్నాం, కానీ ఇప్పుడు 'గోస్ట్‌లైటింగ్' అనే కొత్త వైరస్ డేటింగ్ ప్రపంచాన్ని చుట్టేస్తోంది. ఇది కేవలం వదిలేసి వెళ్ళిపోవడం మాత్రమే కాదు, ఎదుటివారి మనసుని దెబ్బతీసే ఒక ప్రమాదకరమైన ధోరణి. అసలు ఈ గోస్ట్‌లైటింగ్ అంటే ఏంటి? దీనివల్ల కలిగే మానసిక వేదన ఎలాంటిదో ఇప్పుడు తెలుసుకుందాం.

ఘోస్టింగ్ vs గోస్ట్‌లైటింగ్.. తేడా ఏంటి?:

మొదట 'ఘోస్టింగ్' గురించి చూస్తే, ఏదైనా రిలేషన్‌లో ఉన్న వ్యక్తి ఎలాంటి కారణం చెప్పకుండా, ఫోన్ కాల్స్, మెసేజ్‌లకు రెస్పాండ్ అవ్వకుండా అకస్మాత్తుగా మాయమైపోవడాన్ని ఘోస్టింగ్ అంటారు. ఇది ఎదుటివారికి క్లోజర్ ఇవ్వకుండా తీవ్రమైన అయోమయానికి గురిచేస్తుంది. ఇక అయితే, 'గోస్ట్‌లైటింగ్' దీనికంటే ఒక అడుగు ముందుంటుంది. ఇది ఘోస్టింగ్ మరియు మానసిక మానిప్యులేషన్ కలయిక. ఇందులో అవతలి వ్యక్తి మాయమైపోవడమే కాకుండా, ఆ తప్పు మీదే అన్నట్టుగా మీ మైండ్‌తో ఆడుకుంటారు. ఉదాహరణకు, వారు రిప్లై ఇవ్వకపోతే, నువ్వే చాలా అతిగా ఊహించుకుంటున్నావు, నువ్వే నన్ను విసిగిస్తున్నావు అని నిందలు ఎదుటి వారిపైన వేసి మరీ మాయమవుతారు ఇదే ఇందులో హైలెట్.

మీ తప్పు లేకపోయినా నింద మీపైనే:

ఘోస్ట్ లైటింగ్‌లో అతిపెద్ద మైనస్ ఏంటంటే, తప్పు చేసిన వారు కాకుండా బాధితులే క్షమాపణలు చెప్పేలా చేస్తారు. ఒక వ్యక్తి మిమ్మల్ని పట్టించుకోకపోయినా లేదా అబద్ధాలు చెప్పినా, మీరు దాన్ని ప్రశ్నిస్తే.. నీ జ్ఞాపకశక్తి సరిగా లేదు, నేను అలా ఎప్పుడూ అనలేదు,నువ్వు పొరబడుతున్నావ్, అని మిమ్మల్ని మీరు అనుమానించుకునేలా చేస్తారు. ఆ తర్వాత సైలెంట్‌గా మాయమైపోతారు. ఒకవేళ మళ్ళీ తిరిగి వస్తే, నువ్వు బిజీగా ఉన్నావనుకున్నాను అందుకే మెసేజ్ చేయలేదు అని సింపుల్‌గా మీపైకి నెట్టేస్తారు. ఇలాంటి ప్రవర్తన వల్ల ఎదుటి వ్యక్తికి ఆత్మవిశ్వాసం తగ్గిపోయి, తమ రియాలిటీని తామే నమ్మలేని స్థితికి చేరుకుంటారు ఇదే డెంజర్ స్థితి.

దీని నుండి బయటపడటం ఎలా:

ఇలాంటి రిలేషన్ల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే ముందుగా కొన్ని హెచ్చరికలను గుర్తించాలి. అవతలి వ్యక్తి ప్రవర్తనలో నిలకడ లేకపోయినా, ప్రతి విషయంలో మిమ్మల్ని తప్పు పడుతున్నా అది మొదటి హెచ్చరిక అని గ్రహించాలి. ఎవరైనా అకస్మాత్తుగా మాయమైతే, తిరిగి వచ్చినప్పుడు సూటిగా ప్రశ్నించండి.ఇక వారు బాధ్యత తీసుకోకుండా మళ్ళీ మిమ్మల్ని నిందిస్తే, వెంటనే ఆ బంధం నుండి బయటకు వచ్చేయడం మంచిది. డేటింగ్ అనేది ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఉండాలి కానీ, ఒక డిటెక్టివ్ లాగా వారి వెనుక పడటానికి కాదు. మిమ్మల్ని గౌరవించే, ప్రేమించే, వారితో స్వయంగా మాట్లాడి మీ స్నేహం లేదా ప్రేమను కొనసాగించండి. మానసిక ప్రశాంతత కంటే ఏదీ ముఖ్యం కాదు. ఇక గోస్ట్‌లైటింగ్ చేసే వారి మాయలో పడి మీ ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోకండి. నిజమైన ప్రేమ ఎప్పుడూ మీ ఆలోచనలను తప్పు పట్టదు.

Tags:    

Similar News