• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  'ని'దానం నాగేందర్..!

'ని'దానం నాగేందర్..!

By - Tupaki Desk
Update: 2018-09-11 01:30 GMT
దానం నాగేందర్‌.......కాంగ్రెస్ పార్టీలో వై.ఎస్.రాజశేఖర రెడ్డి మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీలో హైదారబాద్‌ కాంగ్రెస్ రాజకీయాలలో "చేయి" తిప్పిన మనిషి. అయితే తన కప్పగంతుల రాజకీయాలతో ప్రజలలోనే కాదు రాజకీయ పార్టీలో కూడా విశ్వసనీయత కోల్పోతున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. సమైక్య రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి అధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమాలలో దానం నాగేందర్ చురుకుగా పాల్గున్నారు. దీంతో వై.ఎస్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దానం నాగేందర్‌ కు అధిక ప్రధాన్యం ఇచ్చురు. మంత్రివర్గంలో చోటు కల్పించారు. అంతే కాదు హైదారబాద్ రాజకీయాలలో దానం నాగేందర్‌ను కీలక వ్యక్తిగా మలిచారు. వై.ఎస్. అండ - తెలుగుదేశం పార్టీపై వ్యతిరేకత - వై.ఎస్. నాయకత్వం దానం నాగేందర్‌ ను అంతేత్తుకు పెంచాయి. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి దానం నాగేందర్‌ కు టిక్కెట్టు దొరకలేదు. దీంతో ఆయన తెలుగదేశం పార్టీలో చేరారు. ఆ పార్టీ నుంచి పోటి చేసారు. ఈ ఎన్నికలలో దానం నాగేందర్ గెలిచారు. తెలగుదేశం పార్టీ ఓడింది.  దీంతో దానం నాగేందర్ పరిస్థితి తారుమారు అయింది.

దానం నాగేందర్ గెలిచారు గాని తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతో ఆయన తిరిగి కాంగ్రెస్‌ లో చేరారు. శాసనసభ్యత్వానికి కూడా రాజీనామ చేయడంతో ఎన్నిక అనివార్యం అయింది. ఈ దశలో కాంగ్రెస్ అభ్యర్దిగా దానం నాగేందర్ మళ్లి పోటి చేసారు. కాని ఓడిపోయారు. దీంతో దానం నాగేందర్ పరిస్థితి మళ్లి మొదటికి వచ్చింది. ఇదంతా పాత కథ. తెలంగాణ విడిపోవడంతో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చింది. నాలుగేళ్లు కాంగ్రెస్‌ లో ఉన్న దానం కారు ఎక్కారు. వచ్చే ఎన్నికలలో తనకు సీటు గ్యారెంటీ అని ఆశ పడ్డారు. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు ఆలోచన మాత్రం వేరేల ఉంది. ఈ ఎన్నికలలో దానం నాగేందర్‌ కు టిక్కెట్టు దక్కె అవకాశాలు కనిపించటం లేదు. ఈ విషయం తెల్సుకున్న దానం నాగేందర్ మళ్లి సొంత గూడు కాంగ్రెస్‌ కు చేరుకుంటారని వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే దానం నాగేందర్ రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరమేనని రాజకీయ పండితులు చెబుతున్నారు. చీటికిమాటికి పార్టీలు మారిపోవడంతో దానం నాగేందర్‌ కు రాజకీయ భవిష్యత్తు ఉండదని రాజకీయ పండితులు అంటున్నారు. రాజకీయ ఎదుగుదల కోరుకుంటున్న దానం నాగేందర్ కాసింత నిదానం పాటించాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Tags:    
  • Danam Nagender 
  • MLA Ticket 
  • TRS Party 

Similar News

మూడు ముళ్ల బంధం.. రూ. 7.50 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

2026-11-19 19:30 GMT

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

Copyright @2026

Powered by Blink CMS