• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  డిసెంబరు 7 శుక్రవారం 2018...

డిసెంబరు 7 శుక్రవారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-12-07 01:30 GMT
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు.

మేష రాశి: కుటుంబంలో చికాకులు. ఆర్థికపరమైన ఇబ్బందులు. వ్యవహారాలు శ్రమానంతరం పూర్తి కాగలవు. రియల్ ఎస్టేట్ వారు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు. ఐటీ నిపుణుల అంచనాలు తప్పుతాయి. విద్యార్థులు ఓపికతో ఉండాలి. మహిళలకు మానసిక అశాంతి. సుబ్రహ్మణ్వేశ్వరుడిని పూజించడం మంచిది.

వ‌ృషభ రాశి: ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగ యత్నాలు కలిసివస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. కాంట్రాక్టులు, రియల్ ఎస్టేట్ వారికి ఉత్సాహంగా గడుస్తుంది. వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. ఐటీ నిపుణులకు నూతన అవకాశాలు వస్తాయి. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు నూతనోత్సాహం. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. మహిళలకు శుభ సమాచారం అందుతుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మంచిది.

మిథున రాశి: ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. రియల్ ఎస్టేట్ వారికి కలిసొచ్చే కాలం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. రాజకీయ వేత్తలకు మంచి గుర్తింపు లభిస్తుంది. కొన్ని పనులకు శ్రీకారం చూడతారు. విద్యార్థులకు అనుకోని అవకాశాలు వస్తాయి. రాజకీయ వేత్తలకు మంచి గుర్తింపు లభిస్తుంది. మహిళలకు భూలాభాలు. గాయత్రీ ధ్యానం చేయడం మంచిది.

కర్కాటక రాశి: రాబడి అంతగా కనిపించదు. ఆత్మీయులతో కలహాలు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. కొన్ని కాంట్రాక్టులు చేజారవచ్చు. వ్యాపార లావాదేవీలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణులకు ఒక కీలక సమాచారం అందుతుంది. విద్యార్థులు మరింత శ్రమించాలి. మహిళలకు కుటుంబ సమస్యలు. ఆంజనేయ స్వామికి అర్చన చేయడం మంచిది.

సింహ రాశి: ఆరోగ్యపరమైన చికాకులు తప్పవు. జీవిత భాగస్వామితో విబేధాలు నెలకొన్న సర్దుబాటు కాగలవు. బంధువర్గం నుంచి విమర్శలు ఎదురుకావచ్చు. వ్యాపార లావాదేవీలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగులకు అనుకోని మార్పులు. పారిశ్రామికవేత్తలకు నిరుత్సాహమే. ఐటీ నిపుణులకు నిరాశాజనకం. విద్యార్థులు లక్ష్య సాధనలో వెనుకపడతారు. నిరుద్యోగులక శ్రమ తప్పదు. మహిళలకు కుటుంబంలో సమస్యలు. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.

కన్యారాశి: ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. యత్న కార్యసిద్ధి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాల్లో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కుతాయి. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు నూతనోత్సాహం. ఐటీ నిపుణులకు అనుకూల ఫలితాలు. శత్రువులు మిత్రులుగా మారతారు. విద్యార్థులకు పోటీపరీక్షల్లో అనుకూలం. మహిళలు శుభవార్తలు వింటారు. విష్ణుసహస్ర నామం పారాయణం చేయడం మంచిది.

తులారాశి: కుటుంబ సమస్యలు వేధిస్తాయి. బంధువులతో తగాదాలు. రాబడి, ఖర్చులు సమస్థాయిలో ఉంటాయి. భూవివాదాలు నెలకొంటాయి. రియల్ ఎస్టేట్ వారికి సామాన్యంగానే ఉంటుంది. ఉద్యోగులకు స్థానచలనం. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఒత్తిడులు. ఐటీ నిపుణులు అసహనానికి లోనవుతారు. మహిళలకు మానసిక అశాంతి. గణపతిని పూజించడం మంచిది.

వృశ్చిక రాశి: పలుకుబడి పెరుగుతుంది. వస్తు, వస్త్ర లాభాలు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకం. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.  రియల్ ఎస్టేట్ వారికి శ్రమ ఫలిస్తుంది. పారిశ్రామిక, రాజకీయ వేత్తలకు సమస్యలు తీరతాయి. ఐటీ నిపుణులకు ఒక ముఖ్య సమాచారం అందుతుంది. విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగాల్లో కొంతమేరకు పనిభారం తగ్గుతుంది. మహిళలకు సన్మానాలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం మంచిది.

ధనస్సు రాశి: ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. హమీల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. సోదరులు, మిత్రులతో విబేధాలు. ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. రియల్ ఎస్టేట్ వారికి ఆటంకాలు. వ్యాపారాలు ఒడిదుడుకులతో సాగుతాయి. ఉద్యోగులకు విధుల్లో అవరోధాలు. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు రద్దు. ఐటీ నిపుణులకు గందరగోళంగా ఉంటుంది. విద్యార్థులకు అవకాశాలు చేజారుతాయి. మహిళలకు మానసిక అశాంతి. వేంకటేశ్వరస్వామిని పూజించడం మంచిది.

మకర రాశి: ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరం. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. కొత్త పనులు చేపట్టి పూర్తి చేస్తారు. బంధువులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. రియల్  ఎస్టేట్ వారికి చికాకులు తొలగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. పారిశ్రామిక - కళారంగాల వారికి విదేశీ పర్యటనలు. ఐటీ నిపుణులకు కొన్ని ఇబ్బందులు తప్పవు. విద్యార్థులకు అరుదైన అవకాశాలు వస్తాయి. మహిళలకు కుటుంబీకుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. కనకధారా స్తోత్రం పఠించండి.

కుంభరాశి:  ఆలోచనలు కలిసి వస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాల్లో చికాకులు తొలగుతాయి. పారిశ్రామిక, రాజకీయ రంగాల వారికి సన్మానాలు. ఐటీ నిపుణులకు పురస్కారాలు. విద్యార్థులకు ఒక ప్రకటన సంతోషాన్ని కలిగిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. మహిళలకు గౌరవ పురస్కారాలు దక్కుతాయి. దుర్గాదేవీని పూజించడం మంచిది.

మీనరాశి: ఆలోచనలు స్థిరంగా ఉండవు. శ్రమకు ఫలితం కొంత మేరకే ఉంటుంది. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్య సూచనలు. రియల్ ఎస్టేట్ వారికి సమస్యలు ఎదురుకావచ్చు. ఉద్యోగాల్లో మార్పులు ఉండవచ్చు. పారిశ్రామిక - రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణులకు మానసిక ఆందోళన. కొన్ని పనుల్లో అవాంతరాలు. విద్యార్థులకు నిరాశ కలుగుతుంది. మహిళలకు అనారోగ్యం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం మంచిది.

   

Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

విజయ్ జగన్ కేటీఆర్...ఒకే ఫ్రేమ్‌ లో !

2026-11-06 01:43 GMT

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

Copyright @2026

Powered by Blink CMS