• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సెప్టెంబర్ 20 గురువారం...

సెప్టెంబర్ 20 గురువారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-09-20 01:33 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
   
మేషరాశి:   సంకల్పం నెరవేరుతోంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల ఆరోగ్యం మెరుగవుతుంది. ప్రముఖులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. పరిశ్రమలు - వ్యవసాయ రంగాల వారు పెద్దల సహకారంతో పనులు పూర్తి చేస్తారు. కందులు - ఎండుమిర్చి - స్టాకిస్టులు - వ్యాపారులకు సంతృప్తి కనిపిస్తుంది. స్త్రీలకు నూతన పరిచయాలతో ఇబ్బంది. ఉపాధ్యాయులకు ఒక సమాచారంతో ఆసక్తి కలుగుతుంది. రవాణా రంగాల్లో వారికి సంతృప్తి ఉంటుంది.

వృషభరాశి: వేడుకలు - శుభ కార్యాల్లో పాల్గొంటారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. న్యాయ - ఆడిటింగ్ - బోధన - రవాణా రంగాల వారికి ప్రోత్సాహకరం. విద్యాసంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. వ్యాపారులకు ఈరోజు కలిసివస్తుంది. మోసపోయే ఆస్కారం కూడా కలదు. ప్రింటింగ్ రంగాల వారికి బాకీలు వసూళ్లలో కష్టమవుతుంది. స్థిరాస్థి విక్రయంలో పునరాలోచన మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి.

మిథునరాశి: రియల్ ఎస్టేట్ - నిర్మాణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటికోసం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. వ్యాపారులకు కలిసి వస్తుంది. పెద్దమొత్తంలో ధనసహాయం విషయంలో జాగ్రత్త. కుటుంబ సభ్యులతో చికాకు. ఉద్యోగులకు పై అధికారుల నుంచి ఒత్తిడి - చికాకులు ఎదుర్కొంటారు.

కర్కాటకరాశి: కొత్త పరిచయాలతో లాభాలు. కుటుంబ సభ్యుల విషయంలో శుభపరిణామాలు. కాంట్రాక్టులు - అగ్రిమెంట్లకు అనుకూలం. ప్రేమానుబంధాలు బలపడతాయి. చర్చలు - ప్రయాణాలు ఉల్లాసానిస్తాయి. పత్రిక - ప్రైవేటు సంస్థల్లోని వారికి అనుకూలిస్తాయి. బేకరి - పండ్లు స్వీట్ వ్యాపారులకు బాగా నడుస్తుంది. ఉద్యోగస్థులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగవుతుంది.

సింహరాశి: వృత్తి పరమైన ప్రయాణాలు సఫలమవుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరగవుతుంది. సహోద్యోగులతో చర్చలు ఫలిస్తాయి. పరిశ్రమలు - ఆస్పత్రులు - హోటల్ వ్యవసాయ రంగాల వారు శుభవార్త అందుకుంటారు. బంధువుల అండ లభిస్తుంది.  రాజకీయ నాయకులకు ప్రత్యర్థులు పెరుగుతారు. ప్రేమికులకు ఆంక్షల కత్తులు వేలాడుతాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు లభిస్తాయి. రుణ విముక్తి ప్రయత్నాలు ఫలిస్తాయి.

కన్యరాశి:  సృజనాత్మకత ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. చిన్నారులు - ప్రియమైన వారి కోసం ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలం అందుకుంటారు. స్టేషనరీ - ప్రింటింగ్ రంగాల వారికి పని ఒత్తిడి తగ్గి ఫలితాలు మాత్రం రావు. వాహన నడిపేటప్పుడు జాగ్రత్త. బంధువులతో కలుస్తారు. స్త్రీలకు స్వయం ఉపాధి లభిస్తుంది. ముక్కుసూటి ధోరణితో వివాదాలు తలెత్తుతాయి.

తులరాశి: అద్దె నిర్ణయాలు - బదిలీలు - మార్పులకు అనుకూలం. మనసు మార్పు కోరుకుంటుంది. కుటుంబ సభ్యుల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. నిర్మాణ రంగంలోని వారికి శుభ ప్రదం. చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తవుతాయి. వస్త్ర - బంగారం - వెండి - లోహ పనివాళ్లకు శుభదాయకం. ప్రయాణాల్లో ఊహించని చికాకులు తలెత్తుతాయి. సమాజంలో పలుకుబడి - ఉన్నతి పెరుగుతుంది. చిరు ఉద్యోగులకు చికాకులు తప్పవు. హామీలు - చెక్కుల జారీల్లో ఏకాగ్రత అవసరం.

వృశ్చికరాశి: అగ్రిమెంట్లకు అనుకూలం. కుటుంబ సభ్యుల విషయంలో శుభపరిణామం. ప్రయాణాలు - చర్చలు - ఉల్లాసం కలిగిస్తాయి. కమ్యూనికేషన్లు - విద్యా - రవాణా - బోధన - ఏజెన్సీ రంగాల వారు కీలక సమాచారం అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు సంతృప్తినిస్తాయి. ఉద్యోగులకు అధికారులతో జాగ్రత్తగా మట్లాడితే మంచిది. బంధువులను కలుసుకుంటారు. ఉమ్మడి వ్యవహారాల్లో చికాకులు - ఇంట్లో గొడవలకు ఆస్కారం. ఉపాధ్యాయులకు శ్రమాధిక్యం. స్త్రీలు వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.

ధనురాశి:  ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు పూర్తవుతాయి. ప్రభుత్వ రంగ సంస్థల వారికి ప్రోత్సాహకరం. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ప్రాజెక్టులు చేపడుతారు. గౌరవ మన్ననలు అందుకుంటారు. విదేశీయాన ప్రయత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. నష్టం వస్తుంది. వృత్తి - ఉపాధి పథకాల్లో నిలుదొక్కుకుంటారు. స్తిరాస్థి క్రయవిక్రయాల్లో పునరాలోచన అవసరం.

మకరరాశి: విదేశీ ప్రయాణాలకు అనుకూలం.  చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. చర్చలు - ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. న్యాయ - బోధన - రవాణా - సినీ - రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరం. డబ్బుకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త. అకారణంగా మాటపడాల్సి వస్తుంది. తప్పులు పునరావృతం కానీయరాదు. తేలిగ్గా మోసపోతారు. ఉపాధ్యాయులకు - ప్రైవేటు ఉద్యోగులకు చికాకులు తప్పవు.

కుంభరాశి: పన్నులు - బీమా - గ్రాట్యూటీ - పెన్షన్ పనులకు అనుకూలం. పూర్వ మిత్రులను కలుసుకుంటారు. బ్యాంకులు - ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. సహకార సంఘాలు - బృంద కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారు. బ్యాంకులు - ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. పుణ్యకార్యాలు చేస్తారు. బంధువుల రాకతో పనులు - కార్యక్రమాలు వాయిదా పడుతుంటాయి. స్త్రీలకు అదనపు ఆదాయం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల సమాచారం అందుతుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.

మీనరాశి: జనసంబంధాలు విస్తరిస్తాయి. వృత్తి - వ్యాపారాల్లో సన్నిహితుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు.  నూతన భాగస్వామ్యాలకు అనుకూలం. ప్రముఖుల కలయికతో పనులు అనుకూలిస్తాయి. ఇతరులకు వాహనం ఇవ్వడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. పాత మిత్రుల కలయికతో మీలో కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. కొన్ని విషయాలు అంతగా పట్టించుకోవడం మంచిది కాదు. సామూహిక సేవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతంది.


Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

జగన్ బాస్...ఓడించింది బోస్ !

2026-11-04 16:15 GMT

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

Copyright @2026

Powered by Blink CMS