• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సెప్టెంబర్ 15 శనివారం...

సెప్టెంబర్ 15 శనివారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-09-15 01:57 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
   
మేషరాశి:  రక్షణ - న్యాయ - బోధన, రవాణా రంగాల వారు వృత్తిపరంగా లక్ష్యాలు సాధిస్తారు. ప్రణాళికతో వృత్తి - వ్యాపారాల్లో రాణిస్తారు. మిమ్మల్ని చూసి అసూయ పెరిగిపోతుంది. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. మీ శక్తి సామర్థ్యాలపై నమ్మకం పెరుగుతుంది. కాలంతో పోటీపడి పనిచేస్తారు.

వృషభ రాశి: అంచనాలు అందుకుంటారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల కోసం విలువైన వస్తువులు కొంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కార్మికులు - ఉద్యోగులు - విద్యుత్ లోపం వంటి ఇబ్బందులు ఎదుర్కొని పని కాకుండా ఉంటారు. స్వార్థపూరిత ప్రయోజనాలు ఆశించి చేరువ కావాలనే వారికి దూరంగా ఉండండి. స్త్రీల అభిప్రాయాలకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో మెళకువ అవసరం. కొత్త పరిచయాలు మీ ఉన్నతికి నాంది పలుకుతాయి.

మిథునరాశి:  బంధుమిత్రులతో ఇల్లు కళగా మారుతుంది. జనసంబంధాలు పెరుగుతాయి. శుభకార్యాలు, వేడుకల్లో పాల్గొంటారు. శ్రీవారు - శ్రీమతి విషయంలో శుభ పరిణామాలు సంభవం. ఈరోజు హామీలు- చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. ఉపాధ్యాయులకు విద్యార్థుల నుంచి ఒత్తిడి చికాకులు ఎదుర్కొంటారు. సోదరులకు మీ వంతు సహాయ సహకారాలు అందుతాయి. వాహనాలపై దూర ప్రయాణాలు ప్రమాదకరం.  సహకార సంస్థలు, ప్రైవేటు సంస్థల్లో వారికి గుర్తింపు లభిస్తుంది.

కర్కటకరాశి: వైద్యం - హోటల్స్ - పరిశ్రమల రంగాల వారికి చర్చలు ఫలిస్తాయి. అగ్రిమెంట్లు లాభిస్తాయి. విందు - వినోదాలు ఉల్లాసం కలిగిస్తాయి. వృత్తి , వ్యాపారాలకు కీలక సమాచారం అందుకుంటారు. ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. స్టేషనరీ - ప్రింటింగ్ రంగాల వారికి శ్రమ, పనిభారం అధికమవుతుంది. స్త్రీలతో సంభాషణలో మితంగా ఉండండి. పోస్టల్ - ఎల్.ఐ.సీ ఏజెంట్లకు పురోభివృద్ధి, ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉపాధ్యాయులకు ప్రోత్సాహకరం.

సింహరాశి: బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు చెందిన వారికి ప్రోత్సాహకరం. చిన్నారులు, ప్రియమైన వారి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పొదుపు పథకాలు లభిస్తాయి. సాంకేతిక, వైద్య రంగాల్లోని వారికి అనుకూలంగా ఉంటుంది. పొదుపుపై దృష్టి కేంద్రీకరిస్తారు. సంతానపరంగా మీరు తీసుకునే నిర్ణయాలు మేలు చేకూరుస్తాయి. మీ కుటుంబ విషయంలో ఇతరుల జోక్యం చికాకు తెప్పిస్తుంది.

కన్యరాశి: బదిలీలు, మార్పులకు అనుకూలం - రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి ప్రోత్సాహకరం. ఎలక్ట్రిక్ - ఎలక్ట్రానిక్ - కంప్యూటర్ రంగాల వారికి ఆశాజనకం. గృహ నిర్మాణం - స్థల సేకరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకున్నదొకటి, జరిగేది మరొకటి అయ్యే అవకాశాలున్నాయి. సంతానపరంగా మీరు తీసుకునే నిర్ణయాలు మేలు చేకూరుస్తాయి.

తులారాశి: కమ్యూనికేషన్ రంగం వారు గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. ఉన్నత విద్య - విదేశీ ప్రయాణాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.  బ్యాంకింగ్ వ్యవహారాలు - మధ్యవర్తిత్వాలకు సంబంధించిన విషయాల్లో ఏకాగ్రత ముఖ్యం. వృత్తి - వ్యాపారాలకు సంతృప్తికరంగా సాగుతాయి. రాజకీయ పరిచయాలు లబ్ధిని చేకూరుస్తాయి. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. పత్రికా - వార్త సంస్థల్లోని వారికి ఓర్పు - అంకితభావం ముఖ్యం.

వృశ్చికరాశి: విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పొదుపు పథకాల్లో లాభం కలుగుతుంది. అంచనాలు అనుకూలం. బంధు మిత్రుల సహకారంతో ఆర్థిక లక్ష్యాలు సాధిస్తారు. ఐరన్ - ఆటోమోబైల్ - ట్రాన్స్ పోర్టు - మెకానికల్ రంగాలలో వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఇతరులతో అతిగా మాట్లాడితే భాగస్వామితో విభేదాలు రావచ్చు.

ధనురాశి: ఇంటర్వ్యూల్లో విజయం. గౌరవ పదవులు పొందుతారు. తల్లిదండ్రుల విషయాల్లో శుభపరిణామాలు. వృత్తి వ్యాపారాల్లో కొత్త వ్యూహాలు అనుసరించి విజయం సాధిస్తారు. ప్రముఖులతో కలయిక. విద్యార్థులకు నూతన పరిచయాలు - అవకాశాలొస్తాయి. రాజకీయ నాయకుల పర్యటనల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉన్నత విద్యల కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి.

మకరరాశి: సినీ - రాజకీయ రంగాల వారికి శుభప్రదం. దాన ధర్మాలకు ఖర్చు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉన్నత విద్య విదేశీ వ్యవహారాలకు అనుకూలం. ప్రదర్శనలు - సభల్లో పాల్గొంటారు. వాహనాలపై దూర ప్రయాణం మంచిది కాదు. ఒంటెద్దు పోకడలు వద్దు. ఉహాగానాలతో కాలం వ్యర్థం చేయకండి. నరాలకు సంబంధించన చికాకులు ఎదుర్కొంటారు.

కుంభరాశి: వాయిదా పద్ధతులపై విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. మ్యూచువల్ ఫండ్స్, బీమా వ్యవహారాలకు అనుకూలం. మెడికల్ క్లెయిములు మంజూరవుతాయి. కంప్యూటర్ - ఎలక్ట్రానిక్ మెకానికల్ రంగాల వారికి అనుకూలం. రావలసిన ధనం వచ్చి తాకట్టులు విడిపిస్తారు. ఇంటా బయటా చికాకులు అధికమవుతాయి.

మీనరాశి: ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. ఉన్నత పదవులు అందుకుంటారు. ఇంట్లో శుభపరిణామాలు సంభవం. జనసంబంధాలు విస్తరిస్తాయి. వివాహ నిర్ణయాలకు అనుకూలం. సంఘంలో గుర్తింపు - గౌరవం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలకు అన్నివిధాలా అనుకూలం. ఆశ వదిలేసుకున్న ఒక అవకాశం మీకే అనుకూలిస్తుంది.
Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

జగన్ బాస్...ఓడించింది బోస్ !

2026-11-04 16:15 GMT

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

Copyright @2026

Powered by Blink CMS