• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సెప్టెంబర్ 5 బుధవారం 2018...

సెప్టెంబర్ 5 బుధవారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-09-05 02:26 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
 
మేషరాశి: రియల్ ఎస్టేట్ - నిర్మాణ రంగాల్లోని వారు లక్ష్యాలు సాధిస్తారు. సీట్లు - స్థలం మార్పు కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి. కొంత మానిసిక ప్రశాంతత తగ్గుతుంది. ప్రత్యర్థులను సానుకూలంగా మార్చుకుంటారు. ఎదుటివారి నుంచి కొంచెం జాగ్రత్త అవసరం.  డబ్బుకు సంబంధించిన విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే ఆర్థికంగా నష్టం వాటిల్లుతుంది.

వృషభ రాశి: విద్యార్థులకు అడ్మిషన్లు లభిస్తాయి. ప్రేమానుబంధాలు బలపడతాయి. అపోహలను నమ్మకండి.. పనులలో అసంతృప్తి ఉంటుంది. మీపై రూమర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ప్రతిభకు గుర్తింపు ఉంటుంది.  ఇంటా బయటా పరిస్థితులు సామాన్యంగా ఉంటాయి. ఒక సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది.

మిథునరాశి: ఆర్థిక విషయాల్లో కొంచెం అప్రమత్తత అవసరం.. ఇల్లు స్థల సేకరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి. పాత స్నేహితులతో సత్సంబంధాలు బలపడతాయి. నీరసం - నిరాధారం - నిస్సత్తువగా అనిపిస్తుంది. గుండె - శ్వాసకు సంబంధించిన విషయాలలో ఆరోగ్యభంగ సూచనలున్నాయి.

కర్కటకరాశి: కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. విద్యాసంస్థల్లో ప్రవేశంపై నిర్ణయానికి వస్తారు. కాంట్రాక్టులు - అగ్రిమెంట్లకు అనుకూలం. వాహనాల కొనుగోలుకు అనుకూల సమయం. ఆర్థిక వ్యవహారాల్లో కొంత శ్రమను పడతారు. నలుగురితో కలిసిపోయే తత్వం అమితమైన తెలివితేటల వల్ల ప్రగతిని సాధిస్తారు. సమస్యలను పరిష్కరిస్తారు.

సింహరాశి: సినీ - రాజకీయ రంగాల వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. డబ్బులకు సంబంధించిన ఒత్తిడి తగ్గుతుంది. ప్రశాంతంగా కాలం గడుపుతారు. మిమ్మల్ని నమ్మిన వారిని - మీపై ఆధారపడిన వారిని చక్కగా చూసుకుంటారు. మొండి బకాయిలు తీరి డబ్బు మీకు అందుతుంది.

కన్యరాశి: పొదుపు పథకాలు - పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. శుభకార్యాలు - వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. బ్యాంకులతో పనులు పూర్తవుతాయి. డబ్బులు ఎలా వస్తాయో అలా ఖర్చయిపోతాయి. స్నేహితులు - బంధువులతో సరదాగా గడుపుతారు. నైపుణ్యం లేకుండా చేసే పనులు నష్టపరుస్తాయి. అనవసరమైన విరోధాలు ఏర్పడే అవకాశం ఉంది.

తులారాశి: సినీ - రాజకీయ - ప్రభుత్వ రంగాల వారు గౌరవ పదవులు అందుకుంటారు. శ్రమకు తగిన ఫలితం అందుతుంది. ప్రముఖులను కలుసుకుంటారు. ఆర్థికంగా బలపడుతారు. కొన్ని సందర్భాలలో అప్రమత్తత అవసరం. ఆర్థిక విషయాల్లో ముందుచూపుతో వ్యవహరించాలి. డబ్బుకు సంబంధించిన విషయాల్లో ఎవ్వరినీ నమ్మక సొంతంగా చూసుకుంటునే మేలు.

వృశ్చికరాశి: సంకల్పం నెరవేరుతుంది. శుభకార్యాలు - సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు. ఆర్థికపరమైన వ్యూహాలు, ప్రణాళికలు అమలు చేస్తారు. మీకు ఆప్తులు - నచ్చిన వారు మంచి సూచనలు చేస్తారు. ప్రయాణాలకు అనుకూలం. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. పిల్లలు - కుటుంబ విషయాల్లో అశాంతి నెలకొంటుంది. ఇల్లు మార్పు సూచనలు కనిపిస్తాయి. ఆర్థికపరమైన లాభాలుంటాయి.

ధనురాశి: ఇంక్రిమెంట్లు లభిస్తాయి. సంస్మరణల్లో పాల్గొంటారు. రుణాలు మంజూరవుతాయి. అదనపు ఆదాయం లభిస్తుంది. పెద్దల ఆరోగ్యం మెరుగవుతుంది. వ్యాపారాలు మధ్యస్తంగా సాగుతాయి.  మీ మాట మీదే మీరే నిలబడితే మంచిది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం వద్దు.

మకరరాశి: కొత్త పరిచయాలు లాభిస్తాయి. ప్రియమైన వారి నుంచి శుభ సందేశాలు అందుతాయి. రక్షణ - న్యాయ రంగాల వారికి శుభప్రదం.  అప్పుల్లో కొంత వసూలు చేసుకోగలుగుతారు. నూతన కాంట్రాక్టులు లభిస్తాయి. నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది. మీ పనుల్లో ఏకాగ్రత మంచి ఫలితాన్ని ఇస్తుంది. పని ఒత్తిడి ఉన్నా వాటిని పూర్తి చేస్తారు.

కుంభరాశి: ఉద్యోగుల నియామకాలు అనుకూలంగా వస్తాయి. విందు - వినోదాలు - ఉల్లాసంగా గడుపుతారు. వ్యవసాయం - వ్యాపార రంగాలలోని వారికి నిధులు సర్దుబాటవుతాయి. దైవ చింతనతో ఆధ్యాత్మికంగా గడుపుతారు. దూరపు బంధువుల నుంచి అశుభవార్త వింటారు. కొంత ప్రతి కూలంగా ఉంటుంది. పనుల్లో జాప్యంతో ఇతరులతో మాట పడాల్సి ఉంటుంది.

మీన రాశి: ప్రేమనుబంధాలు బలపడతాయి. చిన్నారులు - ప్రియమైన వారి విషయాల్లో శుభవార్తలు వింటారు. వివాహాది - శుభ కార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం.  అవివాహితులకు కుటుంబంలో వివాహం కలిగే అవకాశం ఉంటుంది.పెద్దల నిర్ణయంతో మంచి జరుగుతుంది. సామాజిక, ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.
Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

జగన్ బాస్...ఓడించింది బోస్ !

2026-11-04 16:15 GMT

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

Copyright @2026

Powered by Blink CMS