• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సెప్టెంబర్ 4 మంగళవారం...

సెప్టెంబర్ 4 మంగళవారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-09-04 01:31 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..

మేషరాశి: ఈరోజు ఉద్యోగస్థులకు - కొత్త అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వృత్తిపరమైన చర్చలు - సమావేశాలకు అనుకూలం. కాంట్రాక్టులు - అగ్రిమెంట్లకు మంచి రోజు. ఈరోజు ఒక స్థిరాస్తి కొనుగోలు చేయాలనే ఆలోచన వస్తుంది. దైవా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. హామీలు - మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండడం మంచిది.

వృషభరాశి: ఈరోజు ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది.  అదనపు ఆదాయం లభిస్తుంది. పెట్టుబడులు - పొదుపు పథకాలపై చక్కటి ప్రతిఫలం అందుకుంటారు.  ప్రయాణం - బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ముఖ్యమైన వ్యవహారాల మీదే సమీక్షించండి..

మిథునరాశి: ఈ రోజు స్త్రీలకు ఆరోగ్యం దెబ్బతింటుంది. బంధువులతో పట్టింపులు అధికమవుతాయి. కుటుంబ సభ్యుల కోసం ధనం వెచ్చించాల్సి ఉంటుంది. ఆలయాలను సందర్శిస్తే మంచిది. పాత మిత్రుల కలయికతో మీలో మార్పు చోటు చేసుకుంటుంది. పత్రికా సంస్థల్లోని వారు ఎంత కష్టపడ్డా యాజమాన్యాన్ని మెప్పించలేరు.

కర్కాటక రాశి: ఈరోజు ముఖ్యంగా రాజకీయ - సినీ రంగాల వారికి అనుకూలం. దూరంలో ఉన్న సన్నిహితులతో చర్చలు సంతోషాన్నిస్తాయి.   ఆర్థిక విషయాల్లో పురోగతి లభిస్తుంది. రుణాలు - ఆర్థికసాయం స్వీకరించాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి - ఆందోళనలు మొదలవుతాయి.  కాంట్రాక్టు పనుల్లో ఏకాగ్రత కోల్పోతారు.. బంధువులు దగ్గరవుతారు.

సింహరాశి: ఆర్థిక విషయాల్లో బంధు మిత్రుల సహకారం లభిస్తుంది. ఆశించిన డబ్బు అందుతుంది.  సిమెంట్ - ఇటుక - కలప - ఐరన్ - వ్యాపారులకు పురోభివృద్ధి లభిస్తుంది. ట్రాన్స్ పోర్ట్ - ట్రావెలింగ్ - ఆటోమొబైల్ రంగాల వారికి చికాకులు తప్పవు.  లౌక్యంగా వ్యవహారాలు చక్కదిద్దుకుంటూ వాదనలు కట్టిపెట్టండి.. కోర్టు వ్యవహారాల్లో అనుకూల తీర్పులొస్తాయి.

కన్యరాశి: పెద్దలు - పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు. పట్టుదలతో కృషి చేసి లక్ష్యాలు సాధిస్తారు.  స్థిరాస్తి క్రయ విక్రయాల్లో ప్రముఖుల సలహా పాటించడం మంచిది. ఉద్యోగులకు అపరిచిత వ్యక్తుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పత్రిక - మీడియా సంస్థల్లోని వారికి గుర్తింపు పెద్దగా రాదు. దైవ - పుణ్య - సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తుతాయి.

తులరాశి: కమ్యూనికేషన్ రంగాల వారు - విద్యార్థులకు మంచి రోజు. ఆధ్యాత్మిక - సేవా రంగాల వారికి ప్రోత్సాహకరం. ప్రముఖుల సహకారంతో మీ పనులు సానుకూలమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. హోటల్ - తినుబండార వ్యాపారస్థులకు సంతృప్తికరం. గృహోపకరాణాలు కొనుగోలు చేస్తారు. మీ జీవిత భాగస్వామి మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది.

వృశ్చికరాశి: పూర్వ మిత్రులను కలుస్తారు. సన్నిహితుల ఆరోగ్యం కుదుట పడుతుంది. రుణ ప్రయత్నాలు కొలిక్కివస్తాయి. ఆర్థిక సమస్యలు మిత్రుల సాయంతో సమసిపోతాయి. వ్యవసాయ - తోటల రంగాల వారు శాస్త్రవేత్తల సలహాలు పాటించడం మేలు. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం. స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి.

ధనుస్సు రాశి: ఉన్నత పదవుల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృత్తిపరమైన లక్ష్యాలు సాధిస్తారు.  ఈరోజు కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు బంధువర్గాలతో సత్సంబంధాలు నెలకొంటాయి. పిల్లల కోసం పథకాలు రూపొందిస్తారు. ప్రయాణాల్లో నూతన వ్యక్తుల పరిచయాలు లాభిస్తాయి. రాజకీయ నాయకులకు ప్రత్యర్థులు పెరుగుతారు.

మకరరాశి:  ఆస్పత్రులు - హోటల్ - సేవారంగాల వారికి ప్రోత్సాహకరం. వృత్తిపరమైన ప్రయాణాలు లాభిస్తాయి. వృత్తుల వారికి పురోభివృద్ధి. మీ చుట్టుపక్కల వారికి సాయం లభిస్తుంది.  సోదర - సోదరీమణులతో జాగ్రత్తలు అవసరం. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.. రావలసిన ధనం అందుతుంది. మీ బాధ్యతలు ఇతరులకు అప్పజెప్పవచ్చు.

కుంభ రాశి: చిట్ ఫండ్ లు - డిపాజిట్లపై మంచి ప్రతిఫలం అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి కాస్త అటూఇటూగా ఉంటుంది. ఈరోజు ప్రలోభాలకు లొంగవద్దు. వ్యాపారంలో శ్రమిస్తారు. ఎంత సంపాదించినా ధనం నిలవదు. మీ సమర్ధత - నిజాయితీలను గుర్తిస్తారు. స్త్రీల ఆరోగ్యం మెరగవుతుంది. కష్టమైన పనులను పూర్తి చేస్తారు.

మీన రాశి: ఈరోజు ఆర్థిక  పరిస్థితి బాగుంటుంది. కుటుంబంతో ఉల్లాసంగా గడుస్తుంది.  రుణబాధలు తొలుగుతాయి. ఇతరుల సాయం కోసం చూడకుండా మీ యత్నాలు సాగించండి. మీ బాధ్యతలు ఇతరులకు అప్పగించవచ్చు.  వ్యాపారులకు ఊహించని లాభాలు వస్తాయి. ఓర్పు - నేర్పుతో సాధిస్తారు. బదిలీలు మార్పులకు అనుకూలం.
   

Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

జగన్ బాస్...ఓడించింది బోస్ !

2026-11-04 16:15 GMT

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

Copyright @2026

Powered by Blink CMS