ప్రెగ్నెన్సీ సమయంలో కొవిడ్.. బిడ్డ పుట్టినా కోమాలోనే!
కరోనా మహమ్మారి అనగానే ప్రతిఒక్కరూ జంకుతున్నారు. ఈ మాయదారి రోగం ప్రపంచ దేశాలను సైతం వణికిస్తోంది. వైద్యరంగంలో అన్నిరకాలుగా అభివృద్ధి చెందిన అగ్రరాజ్యలు సైతం వైరస్ కోరలకు విలవిల్లాడుతున్నాయి. అయితే కొవిడ్ రాకుండా ఉండడానికి పిల్లల నుంచి పెద్దల దాకా ప్రతిఒక్కరూ కొన్ని నిబంధనలు పాటిస్తున్నారు. వైరస్ సోకకుండా తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎందుకంటే వైరస్ అంత ప్రమాదకరం. మరి ఇలాంటి వైరస్... గర్భవతులకు సోకితే... అమ్మో ఆ బాధ వర్ణనాతీతం. మహమ్మారి ధాటికి సాధారణ వ్యక్తులే అల్లాడిపోతుంటే... కడుపులో బిడ్డను మోస్తున్న ఆ తల్లుల బాధ చెప్పలేనిది. అయితే ఓ మహిళకు ప్రెగ్నెన్సీ సమయంలో కరోనా సోకింది. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది.
లండన్ కు చెందిన ఓ మహిళకు ప్రెగ్నెన్సీ టైంలో కొవిడ్ పాజిటివ్ గా తేలింది. ఓ ప్రైమరీ స్కూల్ లో టీచింగ్ అసిస్టెంట్ గా పనిచేసే మహిళ లారా వార్డ్ గర్బవతి ఉన్నప్పుడు వైరస్ సోకింది. కాగా ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. చాలారోజులు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంది. సాధారణంగా మహిళలకు డెలివరీ సమయంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. అలాంటిది ఈ మహమ్మారి కూడా తోడైతే వారి ఆరోగ్యం క్షీణిస్తుందని వైద్యులు చాలాసార్లు హెచ్చరించారు. కాగా కరోనా వల్ల వచ్చిన ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్ తో ఆమె కోమాలోకి వెళ్లింది.
కరోనా సోకిన ప్రెగ్నెంట్ లారా వార్డ్... దాదాపు ఏడు వారాలకు పైగా కోమాలోనే ఉంది. ఆమె కోమాలో ఉన్న సమయంలోనే డెలివరీ చేయాలని వైద్యులు నిర్ణయించారు. డెలివరీ డేట్ కన్నా రెండు వారాల ముందుగానే ప్రసవం చేశారు. కోమాలోనే ఉన్న లారా... ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ మంచిగా ఎదగాల్సిన సమయంలో లాారా వైరస్ బారిన పడింది. ఫలితంగా శిశువు ఉండాల్సిన బరువుకన్నా చాలా తక్కువగా ఉందని ఆమెకు డెలివరీ చేసిన వైద్యులు వెల్లడించారు. అయితే వీక్ గా ఉండడం వల్ల ఆ చిన్నారిని వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు ఆ శిశువు ఆరోగ్యంగానే ఉందని స్పష్టం చేశారు.
దాదాపు ఏడు వారాల పాటు కోమాలో ఉన్న లారా... తాను పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన విషయమే తెలియదు. బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఆమె కోమాలోనే ఉంది. ఆ తర్వాత వైద్యానికి స్పందించిన లారా... మెల్లగా కోమా నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత తన బిడ్డను చూసుకుంది. వెంటనే బిడ్డను హత్తుకుని... అమృతం వంటి అమ్మ ప్రేమను కురిపించింది. ఇప్పుడు తల్లి లారా వార్డ్.... శిశువు ఇద్దరూ కూడా ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు వెల్లడించారు.