• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వుహాన్ లో మళ్లీ కరోనా...

వుహాన్ లో మళ్లీ కరోనా కలకలం ...ఏమైందంటే ?

By - Tupaki Desk
Update: 2020-05-02 10:10 GMT
కరోనా మహమ్మరి ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకి మరింతగా పెరిగిపోతుంది. ఈ కరోనా దెబ్బకి అమెరికా అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ మహమ్మారి  గాలి ద్వారా వ్యాపించదని  ప్రత్యక్ష తాకిడి తోనే వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక మరి కొందరు శాస్త్రవేత్తలు గాలిలో కూడా కొంత దూరం వైరస్ వ్యాపిస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఇలా కరోనా పై రోజుకొక వార్త వెలుగులోకి వస్తుంది.

ఈ తరుణంలో తాజాగా వుహాన్ లో సంచలన విషయాలు బయట పడ్డాయి. వుహాన్ లోని కరోనా ఆస్పత్రుల్లో ఇప్పటికి కూడా కరోనా  వైరస్ జాడలు ఉన్నట్టు గుర్తించారు. అయితే  నివాస ప్రాంతాల్లోని గాలిలో మాత్రం ఎలాంటి వైరస్ జాడలు కనిపించలేదట. వుహాన్ నగరంలోని రెండు ఆసుపత్రులలోని గాలిలోని తుంపర్లలో కరోనా ను  గుర్తించినట్టు నేచర్ పత్రికలో ప్రచురితమైన కథనం ఇప్పుడు వుహాన్ లో  కలకలం రేపుతోంది.

ఫిబ్రవరి, మార్చి నెలల్లో వుహాన్‌ లోని రెన్మిన్ ఆసుపత్రితోపాటు కరోనా  బాధితులను క్వారంటైన్ చేసిన తాత్కాలిక కేంద్రం నుంచి శాస్త్రవేత్తలు గాలి నమూనాలను సేకరించారు. కాగా జనం ఎక్కువగా గుమిగూడే ప్రాంతాలు, ఐసోలేషన్ వార్డులు, బాధితుల గదులు, గాలి సరిగ్గా ఆడని బాత్రూమ్ గాలిలో కొద్ది స్థాయిలో వైరస్ జాడలు ఇంకా ఇప్పటికి కూడ ఉన్నట్టు గుర్తించారు. శాస్త్రవేత్తలు బయట కూడా నమూనాలు సేకరించగా అక్కడ ఎలాంటి వైరస్ జాడలు కనియించలేదు. అయితే గాలిలో ఉన్న కరోనా వైరస్ ఎంత వరకు ప్రభావం చూపుతుందన్నది చూడాలి మరి.
Tags:    
  • Corona Virus In Wuhan 
  • Corona Virus In China 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Telugu Daily News 
  • Telugu News Updates 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

గంటా దూకుడు రాజకీయం...బొత్స కూతురు ఏం చేస్తున్నట్లు ?

2026-11-19 03:15 GMT

మోడీ ఇచ్చిన కానుక‌ల వెనుక 'బిజినెస్' యాంగిల్‌!

2026-11-19 03:15 GMT

వైసీపీ వైపు నాన్ ఎన్డీయే వర్గాలు

2026-11-19 03:14 GMT

పవన్ బ్యాలెన్స్ పాలిటిక్స్...చాన్స్ కోసం సైనిక్స్ !

2026-11-19 03:14 GMT

ఈ నెల 23 నుంచి ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాలు ?

2026-11-19 03:13 GMT

జగన్ లండన్ టూర్ ఫిక్స్...ఫుల్ బిజీగానే !

2026-11-19 03:13 GMT

₹50 కోట్ల పెళ్లి.. 4 లక్షల మంది అతిథులు.. విజేతకు థార్ కారు.. ఇలాంటిది చూడలేదప్పుడు?

2026-11-19 03:12 GMT

అందరూ కలిసి ఖైరతాబాద్ ఉప ఎన్నికను ఆపేస్తున్నారన్నట్టు..?!

2026-11-19 03:09 GMT

కూటమిలో భారీ ఉత్కంఠ.. ఎవరికెన్ని జెడ్పీలు ?

2026-11-19 03:09 GMT

మోడీ ఎక్కింది బజాజ్ ఆటో.. క్రెడిట్ మాత్రం పాకిస్తాన్‌కు.. ఫుల్ కామెడీ

2026-11-19 03:07 GMT

చిన్న సైజులో ఎలక్ట్రిక్ డిఫెండర్.. 2027లో రాక!

2026-11-19 03:06 GMT

పెళ్లి పిలుపు ఓకే... షర్మిల వ్యూహం మీదనే ఎన్నో ప్రశ్నలు !

2026-11-19 03:03 GMT

Copyright @2026

Powered by Blink CMS