కరోనా: జంతువులపై సెకండ్ వేవ్ ప్రభావమెంత?
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఎంతటి దారుణాలకు కారణమైందో అందరికీ తెలిసిందే.. సెకండ్ వేవ్ తో ఎంతో మంది ప్రాణాలు పోయాయి. లక్షల మంది కరోనా బారినపడ్డారు. ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పడుతోంది. ప్రభుత్వాలు అన్ లాక్ దిశగా అడుగులు వేస్తున్నాయి.
ఇక దేశంలో కరోనా నివారణకు వేగంగా వ్యాక్సినేషన్ కూడా చేపట్టారు. ఈ సమయంలో మరో వార్త అందరినీ భయపెడుతున్నది. ఇటీవల చెన్నై జూలో రెండు సింహాలు కరోనా వైరస్ తో మృతి చెందడం కలకలం రేపాయి.
చెన్నై సెంట్రల్ జూ అధికారులు అప్రమత్తం అయ్యారు. జంతువులకు కరోనా టెస్టులు చేయాల్సిన విధానంపై చర్చించారు. జూలోని జంతువులకు మాత్రమే కాకుండా ఇంట్లో పెంపుడు జంతువులకు కూడా కరోనా సోకే అవకాశాలు ఉండడంతో మార్గదర్శకాలను రిలీజ్ చేశారు.
వైరస్ బారిన పడిన జంతువులను మిగతా వాటి నుంచి దూరంగా ఉంచాలని సూచించారు. జంతువుల నోటి నుంచి నమూనాలను సేకరించే సమయంలో తప్పనిసరిగా పీపీఈ కిట్లు ధరించాలని ఆదేశించారు.ఆహారం అందించే సమయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.