క్వారంటైన్ లో ఫుట్‌బాల్ ఆడిన కరోనా పేషేంట్స్ ... కేసు నమోదు !

Update: 2020-07-28 05:00 GMT
కరోనా వైరస్ మహమ్మారి దేశ వ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. దేశంలో రోజురోజుకు నమోదు అయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు దేశంలో దాదాపుగా 14 లక్షలకి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే 33 వేలమందికి పైగా కరోనా భారిన పడి మరణించారు. రోజురోజుకి దేశంలో నమోదు అయ్యే కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా దేశంలో అత్యధికంగా మహారాష్ట్ర లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.

ఇక కరోనా సోకిన భాధితులని ఐసోలేషన్ వార్డులో ఉంచగా.. వారిలో కొందరు ఆటపాలటలతో ఎంజాయ్ చేస్తున్నారు.  తాజాగా మహరాష్ట్రలోని కోల్హాపూర్‌ పట్టణంలోని ఐసోలేషన్‌ వార్డులో కరోనా సోకిన పేషెంట్స్ కనీసం మాస్క్ కూడా ఉపయోగించకుండా‌ ఫుట్‌ బాల్‌ ఆడారు. కరోనా బాధితులు ఫుట్ బాల్ ఆడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. కరోనా రోగులు ..  నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి కరోనా సంక్షోభ సమయంలో మాస్కులు ధరించకుండా కరోనా రోగులు ఫుట్ బాల్ ఆడటం ఏమిటని కొల్హాపూర్ జిల్లా అధికారులు రోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలను ఉల్లంఘించి ఫుట్ బాల్ ఆడిన ఆరుగురు కరోనా రోగులపై కేసు నమోదు చేశారు. కాగా, మహారాష్ట్రలో ఇప్పటివరకు నమోదు అయిన  కరోనా కేసుల సంఖ్య 3,83,723 కు చేరింది. 
Tags:    

Similar News