నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలను కప్పేసిన కరోనా
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ కు రంగం సిద్ధమైంది. అయితే ఈ ఎన్నికను కరోనా భయం వెంటాడుతోంది. ఎమ్మెల్సీగా కవిత ఎన్నిక లాంఛనమే అయినా ఆమె కోసం కరోనా సోకిన వారిని సైతం పోలింగ్ స్టేషన్లకు తీసుకొస్తున్నారు. వారికి పీపీఈ కిట్ వేసి మరీ పట్టుకొచ్చి ఓటు వేయించే ప్లాన్ చేయడం విశేషం.
నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ రేపు జరుగుతోంది. అధికారులు ఓటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అక్టోబర్ 9న శుక్రవారం ఈ పోలింగ్ జరుగనుంది. మొత్తం 824 మంది ఓటర్లు ఉన్నారు.
ఇక 824 మంది ఓటర్లలో 24మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కరోనా వైరస్ బారినపడడం కలకలం రేపుతోంది. 24మందికి కరోనా సోకడంతో వారికి సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఓటువేసే అవకాశం కల్పించారు. పోలింగ్ కేంద్రాల వద్ద మాస్కులు, శానిటైజర్లను అందుబాటులో ఉంచారు.
కరోనా సోకిన ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పీపీఈ కిట్లతోపాటు అంబులెన్స్ లు అందుబాటులో ఉంచారు. వైద్య ఆరోగ్య సిబ్బందిని నియమించారు.
ఉప ఎన్నిక కోసం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 50 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ విధులు నిర్వర్తించనున్న అధికారులు, సిబ్బందికి ఎన్నికల పోలింగ్ కు ఒకరోజు ముందు కరోనా పరీక్షలు నిర్వహిస్తారు.
ఇక్కడ ఎమ్మెల్సీ బరిలో టీఆర్ఎస్ పార్టీ తరుఫున మాజీ నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ అభ్యర్థిగా వి. సుభాష్ రెడ్డి, బీజేపీ తరుఫున పి. లక్ష్మీనారాయణ పోటీలో ఉన్నారు.