• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఉత్త‌మ్‌ కు కొత్త...

ఉత్త‌మ్‌ కు కొత్త త‌లనొప్పి వ‌చ్చిప‌డింది

By - Tupaki Desk
Update: 2016-07-07 10:19 GMT
అస‌లే వరుస వైప‌ల్యాల‌తో కుదేల‌వుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఇపుడు కొత్త స‌మ‌స్య వ‌చ్చిప‌డింది. పీసీసీ చీఫ్‌  ఉత్తమ్ కుమార్ రెడ్డి టార్గెట్‌ గా సీనియ‌ర్ నేత‌లు అసంతృప్తి గ‌ళం వినిపిస్తున్నారు. త‌మ వారికి ప‌ద‌వులు ఇవ్వ‌లేద‌ని కొంద‌రు అంటుంటే..త‌న‌తో చ‌ర్చించ‌కుండా ఇలా చేశారేంట‌ని ప‌లువురు నిల‌దీస్తున్నారు.

పీసీసీ రాష్ట్ర ర‌థ‌సార‌థిగా బాధ్యతలు తీసుకున్న ఏడాదిన్నర తర్వాత కొత్త కమిటీని నియమించుకున్నారు. తాజాగా ఆయన ప్ర‌క‌టించిన పీసీసీ అధికార ప్రతినిధుల జాబితా కాంగ్రెస్ లో హీట్ పుట్టిస్తోంది. పెద్ద సంఖ్య‌లో అధికార ప్ర‌తినిధుల‌ను నియ‌మించిన‌ప్ప‌టికీ జంబో టీమ్ లో  చోటు దక్కని నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికార ప్రతినిధుల నియామకంపై మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సంపత్ కుమార్ .. ఫైరయ్యారు.  తనను సంప్రదించకుండా తన నియోజకర్గానికి చెందిన వ్యక్తికి అధికార ప్రతినిధి పదవి ఇవ్వటంపై అభ్యంతరం తెలిపారు. ఇక  తాను చెప్పిన వాళ్ళకు అధికార ప్రతినిధి ఇవ్వలేదని మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ .. పీసీసీ చీఫ్ తో వాగ్వాదానికి దిగారు. కొన్ని నియోజకవర్గాలకు అసలు ప్రాధాన్యతే లేదని మరికొందరు నాయకులు  ఉత్తమ్ ను కలిసి అసంతృప్తిని తెలియజేశారు.

ఇదిలాఉండ‌గా... అధికార ప్రతినిదులుగా ప్రకటించిన వారిలోనూ కొందరు అసంతృప్తి ఉన్నారు. కొన్ని రోజుల కిందట పార్టీలోకి వచ్చిన వారికీ - ఎప్పటినుంచో పార్టీలోకి ఉన్న తమకూ  ఒకే పదవి ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు. ప్రభుత్వ మాజీ విప్ గండ్ర వెంకట రమణా రెడ్డి - సీనియర్ నేత నిరంజన్ తో పాటు మిగతా నేతలు ఉత్త‌మ్‌ జాబితాపై గుస్సాగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గ్రూపు రాజకీయాలతో ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ కు అధికార ప్రతినిధుల నియామకం మరింత తలనొప్పిగా మారిందని అంటున్నారు.
Tags:    
  • Congress Senior LEaders 
  • Uttam Kumar Reddy 

Similar News

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

Copyright @2026

Powered by Blink CMS