ఇచ్చినోళ్లు.. ఇప్పించినోళ్లు జీరో అయ్యారే
రాష్ట్ర విభజనకు సంబంధించి కీలక నిర్ణయాన్ని తీసుకుంది కాంగ్రెస్ పార్టీ అయినా.. ఆ పార్టీ ఆ విధంగా అడుగు వేయటానికి కారణం తెలుగుదేశం పార్టీ అన్న విషయాన్ని మర్చిపోకూడదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని ఎన్నికల హామీని కాంగ్రెస్ ఇచ్చినా.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల తర్వాత.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తాము కచ్ఛితంగా ఉన్నామన్న మాటను మాట వరసకు కూడా చెప్పని పరిస్థితిని కాంగ్రెస్ కొంతకాలం కొనసాగించిందన్న విషయం మర్చిపోకూడదు.
ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ తెలుగుదేశం పార్టీ విస్పష్టం నిర్ణయం తీసుకొని.. ఆ విషయాన్ని కేంద్రానికి పంపిన తర్వాత మాత్రమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ జోరందుకున్న విషయాన్ని మర్చిపోకూడదు. అయితే.. టీడీపీ తీసుకున్న నిర్ణయంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని పక్కాగా చెప్పలేనప్పటికీ.. రాష్ట్ర విభజన విషయాన్ని కాంగ్రెస్ సీరియస్ గా తీసుకోవటానికి టీడీపీ తీర్మానం కారణంగా మారిందన్న మాటను కాదనలేం.
అప్పుడెప్పుడో జరిగి పోయిన ఈ విషయాల్ని ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నారన్న సందేహం రావొచ్చు. దానికి కారణం లేకపోలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కీలకనిర్ణయాలు తీసుకున్న రెండు ప్రధాన రాజకీయ పార్టీల పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారిన నేపథ్యంలో నాటి సంగతులు ప్రస్తావించాల్సిన అవసరం ఉంది.
తెలంగాణ ఏర్పాటుకు కీలక నిర్ణయం తీసుకొని కేంద్రానికి తమ పార్టీ తీర్మానాన్ని పంపిన తెలుగుదేశం పార్టీ విభజన ప్రక్రియ జోరందుకునేలా చేస్తే.. తమపై పెరిగిన ఒత్తిడికి పరిష్కారంగా విభజన తప్ప మరొక మార్గం లేదంటూ రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేసేస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.
అయితే.. దీనంతటికి కారణమైన తెలుగుదేశం పార్టీ గురించి చాలా తక్కువ మంది మాత్రమే గుర్తు పెట్టుకున్నారు. అంతిమంగా నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ మీద ఆగ్రహంతో ఏపీ ప్రజలు ఆ పార్టీకి ఏపీలో సమాధి కట్టిన సంగతి తెలిసిందే. విభజన అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒక్కటంటే.. ఒక్క సీటులో గెలవని దుస్థితిలో కాంగ్రెస్ కూరుకుపోతే.. విభజన విషయంలో కీలకపాత్ర పోషించిన టీడీపీ తెలంగాణలో కొద్దోగొప్పో సీట్లను సంపాదించింది.
అయితే.. కేవలం 22 నెలల వ్యవధిలోనే ఇప్పుడా పార్టీ తెలంగాణలో దారుణంగా దెబ్బ తినటం గమనార్హం. ఒకప్పుడు తెలంగాణలో ఒక వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ తాజాగా వరంగల్.. ఖమ్మం కార్పొరేషన్లకు జరిగిన స్థానిక ఎన్నికలతో పాటు అచ్చంపేట నగర పంచాయితీకి జరిగిన ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క డివిజన్ లో కూడా గెలవకపోవటం గమనార్హం. అదే సమయంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో ఒక్క రేవంత్ రెడ్డి.. (ఆర్. కృష్ణయ్య) మినహా మిగిలిన వారంతా తెలంగాణ అధికారపక్షంలోకి వెళ్లిపోయినట్లే. ఇక.. జిల్లాల వారీగా చూసినప్పుడు ఆ పార్టీ పరిస్థితి దారుణంగా మారింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా తొలుత లేఖ ఇచ్చిన టీడీపీ తెలంగాణలో దాదాపుగా జీరో అయితే.. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ ఏపీలో జీరో అయ్యింది. మొత్తంగా రాష్ట్ర విభజనకు కారణమైన కీలక పార్టీలు రెండూ ‘జీరో’ కావటం గమనార్హం.