• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ప్రభుత్వ అధికారిపై...

ప్రభుత్వ అధికారిపై పెట్రోల్ పోసిన కాంగ్రెస్ లీడర్

By - Tupaki Desk
Update: 2018-02-20 16:10 GMT
వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని నమ్మకంగా ఉన్నారో.. లేదంటే ఎలాగూ ఓడిపోతాం కాబట్టి ఇప్పుడే తమ జులుం అంతా చూపించాలని అనుకుంటున్నారో ఏమో కానీ కర్ణాటక కాంగ్రెస్ నేతలు మాత్రం రోజుకో వివాదం సృష్టిస్తున్నారు. తమ రౌడీయిజాన్ని జనం మీద చూపిస్తున్నారు. దీంతో ఎన్నికల వేళ ఇది మరింత నష్టం కలిగించడం ఖాయమని ఆ పార్టీ పెద్దలు ఆందోళన చెందుతున్నారు.    
    
కర్ణాటకలో కాంగ్రెస్‌ నేతలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. మొన్నటికి మొన్న ఓ ఎమ్మెల్యే కుమారుడు పబ్‌ లో ఓ వ్యక్తిపై దాడి చేసి పరారవగా... తాజాగా మరో కాంగ్రెస్‌ నేత ఏకంగా పెట్రోల్‌ సీసా పట్టుకుని ప్రభుత్వ కార్యాలయం తగలబెట్టడానికి రెడీ అయ్యాడు.     కేఆర్‌ పురం బ్లాక్‌ మాజీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నారాయణస్వామి ఇటీవల హోరమావులోని బృహత్‌ బెంగళూరు మహానగర పాలిక వార్డ్‌ కార్యాలయంలో పెట్రోల్‌ బాటిల్‌తో అందరినీ భయపెట్టాడు. కేఆర్‌పురం ఎమ్మెల్యే బైరతి బసవరాజ్‌ ప్రధాన అనుచరుడైన నారాయణస్వామి వార్డ్‌ కార్యాలయంలో పెట్రోల్‌ చల్లి తగులబెడతానని హెచ్చరించాడు. హెచ్చరించడమే కాదు కార్యాలయంలో ఉన్న రెవెన్యూ అధికారిపై పెట్రోలు పోశాడు.
    
స్థానికంగా ఒక భూవివాదంలో ఉన్న ఆయన అందుకు సంబంధించిన పత్రాలపై తనకు అనుకూలంగా సంతకాలు చేయించేందుకు అదికారులను బెదిరించాడు. వారు లొంగకపోవడంతో ఏకంగా పెట్రోలు పోశాడు. కొద్దిరోజుల కిందట జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఈ రోజు బయటకు రావడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమ నాయకుల తీరుతో నష్టం తప్పదని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయట.

Full View
Tags:    
  • Congress Leader 
  • Petrol 
  • Municipality Office 

Similar News

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS