రిమోట్ కంట్రోల్ లేనే లేదు ...రాహుల్ మాటలు నమ్మొచ్చా...?
అన్ని రకాల రాజకీయ అవలక్షణాలకు కాంగ్రెస్ కేంద్రం అని విమర్శలను ప్రత్యర్ధులు చేస్తారు. అందులో తప్పేమీ లేదు. కాంగ్రెస్ వయసు దృష్ట్యా దేశంలోనే చాలా సీనియర్. మరి ఎంత ముదిరితే అన్ని ఇబ్బందులు కూడా దాంతో పాటు వస్తాయి. అలా కాంగ్రెస్ కి మంచి తో పాటు అనేక రకాలైన జాడ్యాలు కూడా వెంట వచ్చాయి. అందులో వారసత్వం అతి ముఖ్యమైనది.
గాంధీ కుటుంబీకుల నీడలోనే కాంగ్రెస్ మనగలుగుతుందని, మనగలగాలని ఒక గట్టి నమ్మకం సగటు కార్యకర్తది. అలా వారి మైండ్ సెట్ మార్చిన ఘనత మాత్రం ఆ పార్టీ పెద్దలదే. ఇక కాంగ్రెస్ లో ఎవరు ఏ ఉన్నత పదవిలో ఉన్నా గాంధీలే శాసిస్తారు. వారే పాలిస్తారు అని కూడా అంతా చెప్పుకునే విషయమే.
అలాంటి కాంగ్రెస్ పార్టీలో గాంధీలు కాకుండా కొత్త వారిని ప్రెసిడెంట్ గా చేయడం గతంలో ఉంది. ఇపుడు మరో సారి ఆ ముచ్చట సాగుతోంది. అప్పట్లో సీతారాం కేసరి ఇలాగే ఓట్లు తెచ్చుకుని ప్రెసిడెంట్ అయితే ఆయన్ని ఏమీ కాకుండా ఎలా చేశారో అంతా చూసారు. ఇపుడు మల్లిఖార్జున ఖర్గె, శశిధరూర్ పోటీ చేస్తున్నారు. ఇందులో ఖర్గె వైపు అధినాయకత్వం ఉందని అందరికీ తెల్సిన ఓపెన్ సీక్రెట్.
ఇక శశిధరూర్ కాంగ్రెస్ కి లీడర్ గా వస్తే ఎంతో కొంత మార్పు ఉంటుందని విశ్లేషకులు అంటున్నా అంత సీన్ అక్కడ లేదు అన్నది అందరికీ కూడా అర్ధమవుతున్న విషయం. ఇదిలా ఉంటే కాంగ్రెస్ లో ఎన్నికలు అన్నవి ఒక ప్రహసమని మీడియా అంటూనే ఉంది. దీని మీద నేరుగా రాహుల్ గాంధీని ప్రశ్నించింది. దానికి ఆయన బదులిస్తూ అలా ఎందుకు అనుకోవాలి అని ఎదురు ప్రశ్నించారు.
కాంగ్రెస్ లో సంస్థాగత ఎన్నికలు పక్కాగా జరుగుతున్నాయని, పోటీలో ఉన్న ఖర్గె కానీ శశిధరూర్ కానీ ఇద్దరూ అనుభవం విశేషంగా ఉన్న వారే. ఈ ఇద్దరిలో ఎవరు గెలిచినా పూర్తి అధికారాలతో అధ్యక్ష బాధ్యతలను నిర్వహిస్తారు, వారిని ఎవరూ రిమోట్ కంట్రోల్ తో ఎవరూ ఎపుడూ ఎక్కడ అయినా నియంత్రించలేరు. అలా ప్రచారం చేయడం ద్వారా వారిని అవమానించడమే అవుతుంది అని బాగానే చెప్పుకొచ్చారు.
కానీ కాంగ్రెస్ లో అలా జరుగుతుందా. ఖర్గె రేపటి రోజున స్వేచ్చగా నిర్ణయాలు తీసుకోగలరా. ఆయన దేశమంతా తాను పాదయాత్ర చేస్తాను రాహుల్ ని తప్పుకోమంటే తప్పుకుంటారా. లేక కాంగ్రెస్ గెలిస్తే తానే ప్రధాని అభ్యర్ధిని అని ప్రకటించుకోగలరా. ఇవన్నీ ప్రశ్నలుగా చూస్తే చిన్నవే. కాంగ్రెస్ లో మాత్రం వీటికి జవాబు ఉండదు. అక్కడ అంతా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలదే రాజ్యం. వారి మాటే చెల్లుతుంది.
అంతవరకూ ఎందుకు రేపటి రోజున ఖర్గె ప్రెసిడెంట్ అయ్యాక తన వద్దకు గాంధీలను రప్పించుకుని వారితో మీటింగ్స్ పెడతారా లేదా వారి వద్దకే ఈ కొత్త పూజారి వెళ్తారా అన్నది ఒక్కటి కనుక తీసుకుంటే చాలు రిమోట్ కంట్రోల్ సిస్టం కాంగ్రెస్ లో లేదు అన్న రాహుల్ మాటలు తప్పు అని చెప్పడానికి అని ప్రత్యర్ధులు అంటున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ కి గ్లామర్ గాంధీ ఫ్యామిలీ. వారిని కాదని ఎవరూ ఏమీ చేయలేరు. సాదారణ జనం సంగతి పక్కన పెడితే ఖర్గె ప్రెసిడెంట్ అని ఆయన చెబితే చేయడానికి సగటు కాంగ్రెస్ కార్యకర్తే సిద్ధంగా ఉండరన్నది నిజమంటున్నారు. సో రాహుల్ బాబూ మీ మాటలు నమ్మలేమనే అంటున్నారు.